
ఈఓఎస్ రాయబారిగా రూబెన్ బిజీథామస్
సాక్షి,చైన్నె : వివాహ చిత్ర నిర్మాణంలో అత్యంత డిమాండ్ ఉన్న పేర్లలో ఒకరైన రూబెన్ బిజీ థామస్‌ను అధికారిక ఈఓఎస్ రాయబారిగా నియమించినట్టు కానన్ ఇండియా ఇమేజింగ్ కమ్యూనికేషన్ బిజినెస్‌సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ విశేష్ ప్రకటించారు. సినిమాటిక్ బ్రిలియోన్స్, లార్జర్ దాన్ లైఫ్ సెలబ్రిటీ వివాహాలకు , వివాహ కథలను చెప్పడంలో,మ్యూజిక్ మోస్ వీడియోలో రూబెన్ ప్రత్యేకత గురించి ఆయన స్థానికంగా గురువారం వివరించారు. ప్రతిష్టాత్మక డీడబ్ల్యు పీ కాంగ్రెస్ ద్వారా ఆయన టాప్ 50 గ్లోబల్ వెడ్డింగ్ పోటోగ్రాఫర్‌లలో ఒకరిగా గుర్తింపు పొంది ఉన్నారని వివరించారు.కానన్ ఈఓఎస్ అంబాసిడర్ ప్రోగ్రామ్ ,పోటో గ్రఫీ, వీడియో గ్రఫీ ల్యాండ్ స్కేప్‌లోని సృజనాత్మక నిపుణులను, పరిశ్రమ అనుభవజ్ఞులను ఒక చోట చేరుస్తున్నట్టు పేర్కొన్నారు.