
వడ సాంబార్ క్రియేషన్స్‌తో రికార్డు
సాక్షి, చైన్నె : తమిళులు మెచ్చే వడ, సాంబార్‌తో రికార్డును సృష్టించారు. ఎస్‌ఆర్‌ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో వినూత్నంగా ఉద్దివడ, సాంబార్ క్రియేషన్స్‌పై గురువారం దృష్టి పెట్టారు. విద్యార్థులు, పాక శాస్త్రంలో శిక్షణ పొందుతున్న వారందరూ కలిసి ఆ విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ డి ఆంటోనీ అశోక్‌కుమార్ పర్యవేక్షణలో 1993 ఉద్దివడలను తయారు చేశారు. సాంబార్ వంటకాలను తయారు చేయడంతోపాటు వాటి ద్వారా ఎస్‌డీజీ 2, జీరో హంగర్ అనే చిహ్నాన్ని రూపొందించారు. తమ విద్యాసంస్థ 1993లో స్థాపించిన విషయాన్ని గుర్తు చేసేలా ఈ ప్రయోగం చేశారు. నో ఫుడ్ వేస్ట్ అనే ఎన్జీ ద్వారా ఈ ఆహారాన్ని అనాధ ఆశ్రమానికి అందజేశారు. వడ, సాంబర్‌తో చేసిన ఈ క్రియేషన్స్ కొత్త రికార్డును సృష్టించినట్టు ఆ విద్యా సంస్థ వీసీ ముత్తమిళ్ సెల్వన్ , రిజిస్టార్ పొన్నుస్వామి పేర్కొన్నారు. ట్రింప్ రికార్డుల జాబితాలోకి చేరిన ఈ క్రియేషన్‌కు గుర్తింపుగా సర్టిఫికెట్‌ను నిర్వాహకులు ప్రదానం చేశారు.

వడ సాంబార్ క్రియేషన్స్‌తో రికార్డు