
ముగిసిన బ్రహ్మోత్సవాలు
నారాయణవనం: స్థానిక టీటీడీ అనుబంధ చంపకవళ్లీ సమేత పరాశురేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి. ఉదయం ఆలయంలో అర్చకులు నిత్యపూజా కై ంకర్యాలను పూర్తిచేశారు. త్రిశులాన్ని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఉత్సవర్లకు, త్రిశూలానికి స్నపన తిరుమంజనం పూర్తి చేశారు. ఆలయానికి కోనేరు లేని కారణంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గంగాళంలో నింపిన జలానికి సంప్రోక్షణ చేసి త్రిశూలాన్ని మూడు మునకలు వేయించారు. సాయంత్రం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ధ్వజస్తంభం నుంచి నందీశ్వరుడి చిత్రపటమున్న వస్త్రాన్ని కిందకు దింపడంతో ఉత్సవాలు ముగిశాయి. కార్యక్రమాల్లో స్థానిక ఆలయాల ఏఈఓ రవి, సూపరింటెండెంట్ ధర్మయ్య, ఆలయ అధికారి నాగరాజు, ఆర్జితం అధికారి భరత్ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలను నిర్విగ్నంగా పూర్తి చేసిన అర్చకులకు మేళతాళాలతో బ్రహ్మోత్సవ బహుమానాన్ని అందించారు.