
డీఎంకే పార్టీని ఆదరించాలి
తిరుత్తణి: ప్రభుత్వ పథకాలు కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ డీఎంకేను ఆదరించాలని డీఎంకే ప్రధానవక్త మొరసొలి మూర్తి పేర్కొన్నారు. తిరుత్తణి పట్టణ డీఎంకే యువజన విభాగం ఆధ్వర్యంలో డీఎంకే నాలుగేళ్ల పాలనపై ప్రజలకు అవగాహన కల్పించేలా స్థానిక కేకే నగర్‌లో ప్రచారసభ నిర్వహించారు. పార్టీ పట్టణ కార్యదర్శి వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని, ప్రసంగించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ వక్త మురసొలి మూర్తి మాట్లాడుతూ సమాజంలో నిరుపేదలు, అట్టడుగు వర్గాల వారి జీవితాలు మెరుగుపడేందుకు, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్య అందేందుకు డీఎంకే ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం రాష్ట్రంపై సవతితల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నట్లు ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను గెలిపించాలని పిలుపునిచ్చారు. జిల్లా యువజన విభాగం కన్వీనర్ తిరుత్తణి కిరణ్, పట్టణ శ్రేణులు గణేశన్, అశోక్‌కుమార్ పాల్గొన్నారు.