
బంగారు తిరుచ్చిపై అమ్మవారు
చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై భక్తులను అనుగ్రహించారు. వారపు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యకై ంకర్యాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వజ్రవైఢూర్యాలతో శోభాయమానంగా అలంకరించి, భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయంలోని శ్రీకష్ణ ముఖమండపం వద్ద స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఆలయ ఆవరణలోని ఆలంకార మండపంలో ఊంజల్ సేవలో సేదతీరారు. రాత్రి సర్వాలంకార భూషితురాలైన శ్రీవారి దేవేరి బంగారు తిరుచ్చి వాహనంపై ఆశీనులై నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.