–వేడుకగా ఉత్తర గోగ్రహణం
కార్వేటినగరం: స్థానిక శ్రీద్రౌపదీ సమేత ధర్మరాజులస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా శుక్రవారం ‘అర్జున తపస్మాన్’ ఘనంగా నిర్వహించారు. తొలుత ద్రౌపదమ్మను ప్రత్యేకంగా అలంకరించి పూలు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటలకు తపస్మాన్‌ను అర్జున వేషధారి అధిరోహించాడు. మెట్టు ..మెట్టుకు పద్యాలు ఆలపిస్తూ, తనవెంట తీసుకెళ్లిన నిమ్మకాయలు, వీభూది ఉండలు, పూలను విసరడంతో భక్తులు వాటికోసం ఎగబడ్డారు. మహిళలు తడిదుస్తులతో తపస్మాన్ చుట్టూ వరపడ్డారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. భాగతారిణి రెడ్డెమ్మ అర్జున తపస్మాన్ ఘట్టంపై హరికథాగానం చేశారు. అంతకు ముందు శివ పార్వతులను నంది వాహనంపై కొలువుదీర్చి గ్రామ వీధుల్లో ఊరేగించారు.
అలరించిన ‘అర్జున తపస్మాన్’