
పిటిషన్ కొట్టివేత
కొరుక్కుపేట: వివాహానికి ముందు జంటలు వైద్య పరీక్షలు చేయించుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. హిందూ ధర్మపరిషత్ నిర్వాహణ ట్రస్టీ రమేష్ మదురై శాఖలో ఈ పిటిషన్ దాఖలు చేశారు. వివాహం తర్వాత జంటల మధ్య అభిప్రాయబేదాల కారణంగా విడాకుల కేసులు పెరుగుతున్నాయి. దీంతో లైంగిక అసమర్థత కారణంగా కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మహిళలు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. యూరప్, కొన్ని అరబ్ దేశాలలో వివాహానికి ముందు జంటలకు వైద్య పరీక్ష తప్పనిసరి చేశారు. అలాగే తమిళనాడు ప్రభుత్వం వివాహానికి ముందు జంటలకు వైద్యపరీక్షలు తప్పనిసరి చేయడానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని పరిశీలిస్తోందని పిటీషన్‌లో పేర్కొన్నారు. గురువారం ఈ పిటిషన్‌ను విచారించిన జస్టీస్ ఎస్ ఎంఎస్ సుబ్రమణ్యం, శ్రీమతితో కూడిన ధర్మాసనం వైద్యపరీక్షను తప్పనిసరి చేస్తూ చట్టం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని పేర్కొంది. అలాంటి చట్టాలను తీసుకురావడానికి పార్లమెంట్‌కు అధికారం ఉందంటూ కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.