
బంగారు తిరుచ్చిపై సూర్య నారాయణుడు
చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ అనుబంధ శ్రీసూర్యనారాయణ స్వామి గురువారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. తొలుత వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు, స్వామివారి జన్మనక్షత్రమైన హస్త సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని వజ్ర వైఢూర్యాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం బంగారు తిరుచ్చి వాహనంపై విహరించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్లు రమేష్, ప్రసాద్, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
03సీడీఆర్46–300073ః బంగారు తిరుచ్చిపై భక్తులను దర్శనమిస్తున్న సూర్య భగవానుడు