
విష్ణుకార్స్‌కు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు
కొరుక్కుపేట: లక్షలాది కస్టమర్ల ఆదరణతో కార్ల వ్యాపారంలో నమ్మకానికి మారుపేరుగా నిలిచిన విష్ణు కార్స్ మరో ప్రతిష్టాత్మక పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది. చైన్నె జీఎస్‌టీ శాఖ ప్రకటించిన టాప్ ట్యాక్స్ పేయర్, అత్యుత్తమ పారిశ్రామిక వేత్తల విభాగాల్లో రెండు పురస్కారాలకు ఏక కాలంలో ఎంపికై న సంస్థగా నిలిచింది. రెండు విభాగాల్లో ఒకే సంస్థ నిలవడం ఇదే తొలిసారి. టాప్ ట్యాక్స్ పేయర్‌గా విష్ణుకార్స్ , ఉత్తమ మహిళా పారిశ్రామిక వేత్తగా విష్ణు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపావెంకట్ ఎంపికయ్యారు. 8వ సిజిఎస్‌టి దినోత్సవాన్ని పురస్కరించుకుని జిఎస్టీ తమిళనాడు అండ్ పుదుచ్చేరి జోన్ చైన్నెలోని కలైవానర్ అరంగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలోదీపా వెంకట్ ఈ రెండు పురస్కారాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో సీయూఎంఐ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీథరన్ రంగరాజన్ , ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ డాక్టర్ రామ్ నివాస్ , ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ ఏఆర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపా వెంకట్ మాట్లాడుతూ 15 ఏళ్లుగా నమ్మకానికి మారుపేరుగా నిలిచిన విష్ణుకార్స్ ను రెండు విభాగాల్లో సిజిఎస్టీ వారు గుర్తించడం పై ఆనందం వ్యక్తం చేశారు .కస్టమర్ల ఆదరణ, సంస్థలో సేవలందిస్తున్న ఉద్యోగుల నిబద్దతతోనే ఇది సాధ్యమైందని తెలిపారు.