
● డీజీపీ ఆదేశాలతో జిల్లాలో చర్యలు ● అజిత్ కుటుంబానికి
ఏఎస్సీ, డీఎస్సీల పర్యవేక్షణలో రాష్ట్రంలో ఉండే ప్రత్యేక పోలీసు బృందాలను రద్దు చేస్తూ డీజీపీ ఆదేశించారు. దీంతో ఈ బృందాలను అనేక జిల్లాలో రద్దు చేస్తూ, ఇందులో పనిచేసే వారిని జిల్లా హెడ్ క్వార్టర్స్‌కు సరెండర్ చేశారు. కాగా, ప్రత్యేక బృందం పోలీసుల చేతిలో దెబ్బలు తిని మరణించిన అజిత్ కుటుంబానికి సీఎం స్టాలిన్ భరోసా ఇచ్చారు. అతడి సోదరుడికి ఆవిన్ సంస్థలో ప్రభుత్వ ఉద్యోగం అప్పగించారు.
సాక్షి, చైన్నె : శివగంగై జిల్లా తిరుభువనంలో సెక్యూరిటీ గార్డు అజిత్‌కుమార్ లాకప్ డెత్ మరణం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ లాకప్ డెత్ కేసులో డీఎస్పీ పర్యవేక్షణలో ఉన్న ఓ ప్రత్యేక పోలీసు బృందం వ్యవహారం వ వెలుగులోకి వచ్చింది. వీరందర్నీ అరెస్టు చేశారు. ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. సీబీసీఐడీ విచారణ కొనసాగే విధంగా మధురై ధర్మాసనం ఆదేశించినా, ఈకేసులో పోలీసు అధికారుల ప్రమేయం గురించి వచ్చిన సమాచారంలో కేసును సీబీఐకు అప్పగిస్తూ చర్యలు తీసుకున్నారు. అలాగే, మధురై జిల్లా కోర్టున్యాయమూర్తి జాన్ తిరుభువనంలో ఈ ఘటనపై విచారణకు శ్రీకారం చుట్టారు. బుధవారం ఆయన ఏడీఎస్పీ సుకుమార్‌తోపాటూ పోలీసులను విచారించారు. అలాగే, తిరుభువనం ఆలయం సిబ్బందితో మాట్లాడి వివరాలను సేకరించారు. ఇక, పోలీసు చేతిలో మరణించి అజిత్‌కుమార్‌కుటుంబ సభ్యులను సీఎం స్టాలిన్ పోన్ ద్వారా పరామర్శించారు. వారికి భరోసా ఇచ్చారు. అతడి సోదరుడు నవీన్‌కుమార్‌కు కారైక్కుడి ఆవిన్ సంస్థలో ప్రభుత్వ ఉద్యోగానికి అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఉద్యోగనియామక ఉత్తర్వులను మంత్రి పెరియకరుప్పన్ అందజేశారు. అలాగే, కుటుంబ సభ్యులకు రూ. ఐదు లక్షలు చెక్కును అందజేశారు.
పొటో: 14 : అజిత్ కుటుంబానికి చెక్కును అందజేస్తున్న మంత్రి పెరియకరుప్పన్
అపవాదుల కారణంగా..
దక్షిణ తమిళనాడుతో పాటూ రాష్ట్రంలో అనేక సమస్యాత్మక ప్రాంతాలలో ఏఎస్పీలు, డీఎస్పీల పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు విధులను నిర్వహిస్తుంటాయి. ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి దూసుకెళ్లడమే ఈ బృందాల పని. ఇలాంటి బృందాలలోని కొందరు సిబ్బంది కారణంగా పోలీసు యంత్రాంగాని అపవాదులు తప్పడం లేదు. ఇందుకు గతంలో చోటు చేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. తాజా ఘటనల నేపథ్యంలో జిల్లాలలోని స్పెషల్ టీంలను రద్దుచేస్తూ డీజీపీ శంకర్ జివ్వాల్ ఆదేశించారు. దీంతో స్పెషల్ టీంలను రద్దు చేశారు. ఇందులోని సిబ్బందిని జిల్లా ఎస్పీ కార్యాలయాలకు సరండర్ చేశారు. తిరునల్వే జిల్లాలోని ఐదు ప్రత్యేక బృందాలను ఆయా ఉన్నతాధికారులు సరెండర్ చేశారు.