
వేలూరు కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు లేఖ
వేలూరు: జిల్లా కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు లేఖ తపాలా కార్యాలయం ద్వారా అందింది. వేలూరు సత్తువాచారిలో కలెక్టర్ కార్యాలయం నడుస్తోంది. ఇందులో ఏ, బి బ్లాక్‌లు మొత్తం ఐదు అంతస్తులున్నాయి. ఇందులో వివిధ శాఖలకు చెందిన కార్యాలయాలు నడుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం తపాలా శాఖ నుంచి ఓ లేఖ వచ్చింది. వాటిని పరిశీలించగా కలెక్టర్ కార్యాలయంలో బాంబు పెట్టామని, అది సాయంత్రం లోపు పేలుతుందని అందులో పేర్కొన్నారు. దీంతో అధికారులు బాంబు స్క్వాడ్ నిపుణులకు సమాచారం అందజేయడంతో నిపుణులు డాగ్స్ స్క్వాడ్ నిపుణులు కలెక్టరేట్‌లోని ఏ, బి బ్లాక్‌లోని అన్ని అంతస్తులను తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ లేఖ తెన్ కాశీకి చెందిన ఒక వ్యక్తి పోస్టు చేసినట్లు అందులో పేర్కొన్నారు. దీనిపై సత్తువాచారి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ బాంబు బెదిరింపు లేఖను ఎవరు పంపించారు.. ఎందుకు పంపారనే కోణంలో విచారణ చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయానికి బాంబు బెదిరింపు లేక రావడంతో అధికారులు సంచలనం రేపింది.