
యాగశాల పూజలకు శ్రీకారం
సాక్షి, చైన్నె : తిరుచెందూరులో కుంభాభిషేకానికి సంబంధించిన యాగశాల పూజలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పవిత్ర జలాలను ఏనుగుపై ఉంచి ఊరేగించారు. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఈనెల 7వ తేదీన మహాకుంభాభిషేక వేడుక జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల కోసం యాగశాల పూజలకు శ్రీకారం చుట్టారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సముద్ర తీరంలో ఉన్న బావి నుంచి పవిత్ర జలాలను సేకరించారు. అక్కడి నుంచి ఏనుగుపై ఊరేగింపుగా యాగశాలకు తీసుకొచ్చి, యాగాది పూజలకు శ్రీకారం చుట్టారు.