
మహిళలకు రుణాల పంపిణీ
తిరువళ్లూరు: పట్టణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటై 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా స్వయం ఉపాధి సంఘాలకు చెందిన మహిళలకు రూ.1.56 కోట్ల రుణాలను కలెక్టర్ ప్రతాప్ మంగళవారం ఉదయం అందజేశారు. స్వయం ఉపాధి మహిళ సంఘాలకు రుణాల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ ప్రభాకరన్, రామమూర్తి తదితరులు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ ప్రతాప్ హాజరై నాలుగు స్వయం ఉపాధి సంఘాలకు రూ.1.30 కోట్లు, విద్యార్థులకు విద్యారుణాల కింద రూ.26 లక్షలసహా మొత్తం రూ.1.56 కోట్ల రుణాలను అందజేశారు. అనంతరం ఎస్‌బీఐలో కేక్‌కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్లు దివ్య ప్రియదర్శిని, అరుణ్‌దేవ్, స్మిత్ తదితరులు పాల్గొన్నారు.