
● కొత్త పథకానికి శ్రీకారం ● ఘనంగా నాన్ మొదల్వన్ 3వ వి
సంపూర్ణ మద్దతు
ఈ కార్యక్రమంలో తొలుత డిప్యూటీ సీఎం ఉదయ నిధి ప్రసంగిస్తూ విజయానికి హామీ ప్రణాళికగా ఈ పథకం రూపకల్పన చేసినట్టు తెలిపారు. సీఎం స్టాలిన్ మాట్లాడుతూ తమిళనాడు యువత నైపుణ్య శిక్షణతో ఉన్నత విద్యను అభ్యసిస్తారని, ఇది 100 శాతం ఉపాధిని కల్పిస్తుందన్నారు. తమిళనాడు యువత కోసం అందిస్తున్న పథకాలను గుర్తుచేస్తూ, ఈ సమూహానికి సంపూర్ణ మద్దుతు ఉంటుందన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడు యువతకు అండగా ఉంటుందని, విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడును అన్నింటా అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పం అని వ్యాఖ్యానించారు. అద్భుత శిక్షణతో భవిష్యత్తుకు గెలుపుతో హామీ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సంవత్సరం నుంచి కళాశాల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందించబోతున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. కష్టపడి పనిచేస్తే విజయం ఖాయం, ప్రతిభ ఉంటే విజయం ఖాయం, దృఢ సంకల్పంతో ఉంటే, విజయం ఖాయం! విజయం ఖాయం! అని వ్యాఖ్యానించారు.
సాక్షి, చైన్నె : నాన్ మొదల్వన్ పథకం మూడో సంవత్సర విజయోత్సవ వేడుకలో గెలుపు తథ్యం నినాదంతో బృహత్తర పథకానికి సీఎం స్టాలిన్ మంగళవారం శ్రీకారం చుట్టారు. చైన్నెలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మంగళవారం నాన్ మొదల్వన్ పథకం మూడు వసంతాల విజయోత్సవం నిర్వహించారు. విద్యార్థులకు శిక్షణలు, ఉద్యోగ నియామక ఉత్తర్వులు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. భారతదేశంలో తమిళనాడును అన్ని రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడం లక్ష్యంగా పాఠశాల విద్యను అభ్యసించిన ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించాలన్న కాంక్షతో నాన్ మొదల్వన్ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అలాగే, పుదుమైపెన్, తమిళ్ పుదల్వన్ పథకాల ద్వారా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారికి నెలకు రూ. వెయ్యి నగదు ప్రోత్సహం అందిస్తున్నారు. 2022లో ఇంజినీరింగ్ కళాశాలలోని విద్యార్థులకు మాత్రమే ప్రారంభించిన నాన్ మొదల్వన్ పథకం, 2023–24లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలకు, ఆ తరువాత పాలిటెక్నిక్ కళాశాలకు విస్తరించారు. ఏటా లక్షలాది మందికి శిక్షణ అందిస్తూ ఉద్యోగాలను సైతం దరి చేరుస్తున్నారు. ఈ పథకం విస్తరణలో భాగంగా బిగ్ డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండస్ట్రీ 4.ఓ, రోబోటిక్స్, తదితర అంశాలను విద్యార్థులకు సులభంగా, ఉచితంగా తరగతుల రూపంలో అందుబాటులో ఉండేలా ఒక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. నాన్ మొదల్వన్ ద్వారా ఇప్పటి వరకు 3,28,393 మందికి ప్రయోజనం చేకూరుస్తూ ఉద్యోగాలను దరి చేర్చారు. దీనికి కొనసాగింపుగా గెలుపు తథ్యం పథకాన్ని మంగళవారం అమల్లోకి తీసుకొచ్చారు. ఈ పథకం విదేశాల్లో సైతం ఉద్యోగ నియామకాలను పొందడంలో కీలక పాత్రను పోషించనుంది. సక్సెస్ గ్యారెంటీడ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచ స్థాయి నాయకత్వంలో ఉన్న వివిధ శిక్షణ సంస్థలతో ఈ సందర్భంగా ఒప్పందాలు జరిగాయి. పరస్పర సహకారం, ఉచిత స్వల్ప కాలిక కోర్సులు, నైపుణ్య శిక్షణ అందించనున్నారు. 18–35 ఏళ్ల వారికి ప్రయోజనం కల్పించేలా గెలుపు తథ్యం అమలు చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఈ శిక్షణలో 38 పారిశ్రామిక రంగాల్లో 165 రకాల శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణ కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, మంత్రులు రాజకన్నప్పన్, పి.కె. శేఖర్‌బాబు, మేయర్ ప్రియ తదితరులు పాల్గొన్నారు.
గెలుపు తథ్యం

● కొత్త పథకానికి శ్రీకారం ● ఘనంగా నాన్ మొదల్వన్ 3వ వి

● కొత్త పథకానికి శ్రీకారం ● ఘనంగా నాన్ మొదల్వన్ 3వ వి