
ఇంధన అక్రమ రవాణాను అడ్డుకున్న భారత్ కోస్ట్ గార్డు
కొరుక్కుపేట: ఇంధనం అక్రమ రవాణాను భారత కోస్ట్‌గార్డు సిబ్బంది అడ్డుకున్నారు. మన్నారు గల్ఫ్‌లో అనుమానాస్పద కార్యకలాపాల గురించి కస్టమ్స్ విభాగం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇండియన్ కోస్ట్‌గార్డు స్టేషన్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. మన్నార్ గల్ఫ్‌లోని ముసల్ దీవుల వద్ద ఉన్న అనుమతికి మించి 600 లీటర్ల పెట్రోల్, ఇండియన్ ఫిషింగ్ బోట్‌ను స్వాధీనం చేసుకుని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కస్టమ్స్ శాఖ దర్యాప్తు చేస్తోంది. సముద్రం ద్వారా అక్రమ వ్యాపా రాన్ని అడ్డుకోవడానికి ఇది మరో విజయవంతమైన ఆపరేషన్ అని ఇండియన్ కోస్ట్‌గార్డు అధికారులు వెల్లడించారు.