
నాణ్యమైన సాంకేతిక విద్యకు ఆర్‌ఎంకే సహకారం
● చైర్మన్ ఆర్‌ఎస్ మునిరత్నం
తిరువళ్లూరు: రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి ఆర్‌ఎంకే విద్యా సంస్థలు సహకారం అందిస్తాయని ఆ సంస్థల చైర్మన్ ఆర్‌ఎస్ మునిరత్నం తెలిపారు. తిరువళ్లూరు జిల్లా క వరపేటలోని ఆర్‌ఎంకే కళాశాలలో ఐఎస్‌టీఈ ప్రొఫె సర్ల సంఘం తమిళనాడు విభాగం 27వ మహానాడు జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎంకే విద్యాసంస్థల ప్రిన్సిపల్ మహ్మాద్ జునైత్ అధ్యక్షత వహించగా ము ఖ్యఅతిథిగా చైర్మన్ ఆర్‌ఎస్ మునిరత్నం, విశిష్ట అతిథి గా విశ్రాంత ఐఏఎస్ పిచ్చాండి హాజరయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరసుబ్రమణ్యం మాట్లాడు తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిచడం, విద్యార్థులను నూతన ఆధునిక పరిశోధనల వైపు ప్రో త్సహించడంలో ప్రొఫెసర్ల పాత్ర కీలకమన్నారు. ఐఎస్‌టీఈ సంఘం ప్రొఫెషన్ సంస్థగానూ, విద్యార్థుల సమగ్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా 1.50లక్షల మంది ప్రొఫెసర్లు, 4లక్షల మంది విద్యార్థులు సభ్య త్వం ఐఎస్‌టీఈ సంఘంలో ఉందన్నారు. ఆర్‌ఎంకే కళాశాల చైర్మన్ ఆర్‌ఎస్ మునిరత్నం మాట్లాడుతూ ఐఎస్‌టీఈ సంస్థ గత ఏడాది కా లంలో విద్యార్థులు, ప్రొఫెసర్ల కోసం 150 కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిందన్నారు. విద్యా ర్థులను ఐటీ రంగంలో ఐఎస్‌టీఈ సంస్థ ప్రోత్సహిస్తు న్న తీరును అభినందనీయమన్నారు. నూతన ఆధునిక పరిశోధనలు చేయడానికి ఆసక్తి ఉన్న విద్యార్థుల ను గుర్తించి, తాము ప్రోత్సహిస్తామన్నారు. డైరెక్టర్ జ్యోతినాయుడు, ఉపాధ్యక్షుడు ఆర్‌ఎం కిషోర్, కార్యదర్శి యలమంచి ప్రదీప్, అడ్వయిజర్ పళణిస్వామి, మైనింగ్ శాఖ మాజీ ఎండీ మనోహరన్, ప్రొఫెసర్ చంద్రమేనీ, శివజ్ఞాన ప్రభు, మణిమారన్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఉత్తమ ప్రొఫెసర్లు, సంఘం ప్రతినిధులను కళాశాల నిర్వాహకులు సత్కరించారు.