
● పది, ప్లస్ ఒన్ ఫలితాలు విడుదల ● పదిలో 93.8 శాతం మంద
సాక్షి, చైన్నె: మార్చి నుంచి ఏప్రిల్ రెండో వారం వరకు ప్లస్‌టూ, ప్లస్ ఒన్, పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగాయి. ఇందులో ముందుగా నిర్ణయించిన సమయానికి కంటే రెండు రోజులు ముందుగానే ప్లస్‌టూ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది కూడా తమదే పైచేయి అని మరో మారు బాలికలు సత్తా చాటుకున్నారు. తాజాగా విడుదల చేసిన పది, ప్లస్‌ఒన్‌లోనూ తమ హవాను కొనసాగించారు. ఫలితాల విడుదలతో ఉత్తీర్ణులైన వారు కేరింతలు కొట్టారు. ఉదయం డీపీఐ ఆవరణలో మంత్రి అన్బిల్ మహేశ్ ఫలితాలను విడుదల చేయగానే విద్యార్థులు తాము రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్లకు వచ్చిన సమాచారాన్ని చూసుకునే పనిలో పడ్డారు. మరికొందరు విద్యా శాఖ ప్రకటించిన వెబ్‌సైట్లపై దృష్టి పెట్టారు. ఉత్తీర్ణత, తమకు వచ్చిన మార్కులను చూసి ఆనందంలో పరస్పరం విద్యార్థులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ప్లస్ ఒన్ ఫలితాలు:
ప్లస్ ఒన్ పరీక్షలను 8,07,098 మంది విద్యార్థులు రాశారు. ఇందులో 7,43,232 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఉత్తీర్ణత 92.09 శాతంగా నమోదైంది. గత ఏడాది కంటే ఈ ఏడాది ప్లస్ ఒన్‌లో 0.92 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత సాధించారు. 2042 ప్రభుత్వ సహకారం, ప్రైవేటు బడులు 282, ప్రభుత్వ బడులు వంద శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. 125 మంది ఖైదీలు పరీక్ష రాయగా 113 మంది ఉత్తీర్ణులయ్యారు. తమిళం సబ్జెక్టులో 41 మంది, ఆంగ్లంలో 39 మంది, ఫిజిక్స్ –390, కెమిస్ట్ట్రీ 593, బయాలజీ –91, మ్యాథ్స్–1338, బోటనీ–4, జువాలజి –2,కంప్యూటర్ సైన్స్‌లో –3,535, హిస్టరీ –806, అకౌంటెన్సీ –111, ఎకనామిక్స్ –254, కంప్యూటర్ అప్లికేషన్ –761, స్టాటిస్టిక్స్‌లో 117 మంది వంద మార్కులు సాధించారు. ప్లస్ ఒన్‌లో అత్యధికంగా 97.76 శాతంతో అరియలూరు, 96.97 శాతంతో ఈరోడ్, 96.23 శాతంతో విరుదునగర్, 95.77 శాతంతో కోయంబత్తూరు, 95.01 శాతంతో తూత్తుకుడిలో మొదటి ఐదు స్థానాలను దక్కించుకున్నాయి. పదో తరగతి ఫలితాల్లో శివగంగై జిల్లా తొలి స్థానంలో నిలవడంతో ఆ జిల్లాకు చెందిన మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ స్థానికంగా ఉన్న పాఠశాల వద్దకు వెళ్లి స్వీట్లు పంపిణీ చేశారు.
ఫెయిల్ అవుతాననే భయంతో ఆత్మహత్య
నామక్కల్ సమీపంలోని పరమత్తివేలూరుకు చెందిన ప్రకాశం, కవిత దంపతుల కుమార్తె కదివాసవి (15). పరీక్షలో తప్పుతానన్న భయంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆ బాలిక 348 మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో ఆ కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టింది. విరుదాచలంకు చెందిన ప్రభు, తేన్‌మొళి దంపతుల కుమార్తె శివానిశ్రీ 500లకు 201 మార్కులే రావడంతోఆత్మహత్యకు పాల్పడింది. తిరుచ్చి టాప్‌పేటై ప్రాంతానికి చెందిన మురళి (50) పరీక్ష సమయంలో మరణించాడు. తండ్రి మరణంతో బాధలో ఉన్న ఆయన కుమార్తె నిరంజన పది ఫలితాల్లో 461 మార్కులు సాధించడం విశేషం.
న్యూస్‌రీల్
రామన్న మంతనాలు!
ఈడీ దాడులు
జూలైలో సప్లిమెంటరీ
మంత్రి అన్బిల్ మహేశ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెరుగుతోందని, ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈనెల 19వ తేదీ నుంచి తాత్కాలిక మార్కుల జాబితాను అందజేస్తామన్నారు. పది, ప్లస్ ఒన్‌లలో మార్కులు తక్కువగా వచ్చిన వారు తమ జవాబు పత్రాల నకలు కోసం ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని సూచించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఈనెల 22 నుంచి జూన్ 6వ తేదీలోపు సప్లిమెంటరీ పరీక్షకు దరఖాస్తులు చేసుకోవచ్చు అని సూచిస్తూ జూలై 4 నుంచి ఈ పరీక్ష ఉంటుందన్నారు. ప్లస్‌టూలో విల్లుపురంలోని ఓ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసిన 167 మంది విద్యార్థులకు వందకు వంద మార్కులు ఓ సబ్జెక్టులో రావడం గురించి విచారణకు ఆదేశించామన్నారు. జూన్ 2వ తేదీన బడుల రీ ఓపెనింగ్‌కు ముందుగా నిర్ణయించామని, ఎండలు, ఇతర పరిస్థితులు బట్టి సీఎం స్టాలిన్ సెలవుల పొడిగింపు ప్రకటన చేస్తారన్నారు. ఇదిలా ఉండగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సీఎం స్టాలిన్, ప్రధాన ప్రతిపక్ష నేత పళణిస్వామి, తమిళ వెట్రి కళగం నేత విజయ్ శుభాకాంక్షలు విడుదల చేశారు. పరీక్ష తప్పిన విద్యార్థులు, తక్కువ మార్కులు సాధించిన వారు, మనోధైర్యంతో ముందుకు సాగాలని, వారికి తల్లిదండ్రులు భరోసాగా నిలబడాలని కోరారు.
ప్లస్‌టూలోనే కాదు పదో తరగతి, ప్లస్ ఒన్‌లోనూ బాలికల హవా కొనసాగింది. పదో తరగతి, ప్లస్‌ఒన్ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. డీపీఐ ఆవరణలో ఈ ఫలితాలను రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ మంత్రి అన్బిల్ మహేశ్ ప్రకటించారు. పదో తరగతిలో 93.80 శాతం, ప్లస్ ఒన్‌లో 92.09 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది.
పది ఫలితాలు
పదో తరగతిలో 8,71,239 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరిలో 8.17,261 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 93.80 గా నమోదైంది. విద్యార్థినులు 95.88 శాతం, విద్యార్థులు 91.74 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక, గత విద్యా సంవత్సరం కంటే ఈ సారి 2.25 శాతం అధిక ఉత్తీర్ణత నమోదైంది. 4,917 ప్రభుత్వ సహకారంతో నడిచే బడులు, మెట్రిక్యులేషన్ బడులు, 1,867 ప్రభుత్వ బడులు 100 శాతం ఉత్తీర్ణతను నమోదు చేసుకున్నాయి. పరీక్ష రాసిన దివ్యాంగులలో 92.83 శాతం మంది ఉతీర్ణులయ్యారు. రాష్ట్రంలో 98.31 శాతం ఉత్తీర్ణతతో శివగంగై జిల్లా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 97.45 శాతం ఉత్తీర్ణతతో రెండవ స్థానంలో విరుదునగర్, 96.76 శాతంతో తూత్తుకుడి మూడో స్థానంలో, 96.66 శాతం ఉత్తీర్ణతతో నాలుగో స్థానంలో కన్యాకుమారి, 96.61 శాతంతో ఐదో స్థానంలో తిరుచ్చి జిల్లాలు నిలిచాయి. తమిళం సబ్జెక్టులో 8 మంది, ఆంగ్లంలో 346 మంది, గణితంలో 1,996, సైన్స్‌లో 10,838, సోషియల్ సైన్స్‌లో 10,256 మంది విద్యార్థులు వందకు వంద మార్కులు దక్కించుకోవడం విశేషం.

● పది, ప్లస్ ఒన్ ఫలితాలు విడుదల ● పదిలో 93.8 శాతం మంద

● పది, ప్లస్ ఒన్ ఫలితాలు విడుదల ● పదిలో 93.8 శాతం మంద

● పది, ప్లస్ ఒన్ ఫలితాలు విడుదల ● పదిలో 93.8 శాతం మంద