
అలరించిన నృత్యప్రదర్శనలు
కొరుక్కుపేట: చిత్రా పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత్ కళా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి, భరతనాట్య నృత్య ప్రదర్శనలతో కళాకారులు రంజింపజేశారు. తంజావూర్‌లోని ప్రాచీన చరిత్ర కలిగిన బృహదీశ్వర ఆలయం వేదికగా చిత్రా పౌర్ణమి కలై విళా –2025 పేరుతో అకాడమీ వ్యవస్థాపక డైరెక్టర్ గురువు రోజా రాణి, అకాడమీ డైరెక్టర్ అండ్ ఆర్గనైజర్ దుర్గా నటరాజ్ అధ్యక్షతన ఈ నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తంజావూరు 13వ రాజు బాబాజీ రాజా బోస్లే, ఇంకా తమిళనాడు యూనివర్సిటీ –తంజావూరు వ్యవస్థాపక చైర్మన్ భాస్కరన్, శివ సేన స్టేట్ ఎగ్జిక్యూటివ్ లీడర్ శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళా రత్న డాక్టర్ సంజయ్ శాంతారామ్, శివ ప్రియా టీమ్ –బెంగళూరు వారు శివోహం భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనతో కనువిందు చేశారు. శాస్త్ర టెంపుల్ ఆఫ్ డ్యాన్స్ టీమ్ కోయంబత్తూర్‌కు డా. అర్చన, వారి శిష్యులు, ద్వనీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ తురైపాక్కంకి చెందిన శారిక, రాజేశ్వరి సుందరరామన్ అకాడమీకి చెందిన తమిళ రోజా జగత్ ప్రభు బృందం చేసిన నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. ఈ సందర్భంగా కళాకారులను ఘనంగా సత్కరించిన నిర్వాహకులు రోజా రాణి మాట్లాడుతూ తంజావూరు గుడిలో నృత్య ప్రదర్శన చేసే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తమకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో ఊర్మిళా సత్యనారాయణన్ నాటక్ అకాడమీకి చెందిన విద్యార్థుల ప్రదర్శన అమోఘం అని కొనియాడారు.
కళా కారులకు ఘన సత్కారం