అన్నానగర్: చైన్నెలోని ఈకాట్టుతాంగల్‌లో రోడ్డు పక్కన పడుకున్న వారిపై యాసిడ్ దాడికి పాల్పడిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. చైన్నె ఈకాట్టుతంగల్ మెట్రో రైలు స్టేషన్ సమీపంలో కొందరు వ్యక్తులు తమ కుటుంబాలతో కలిసి రోడ్డు పక్కన ఉన్నారు. పగలు పని చేసి, రాత్రి అక్కడ పడుకుంటారు. అలా ఆదివారం గణేశనన్, అతని భార్య రేవతి, పిల్లలతో సహ ఆరుగురు కూర్చుని ఉన్నారు. అప్పుడు రెప్పపాటులో ఓ యువకుడు యాసిడ్ బాటిల్ వారిపై విసిరేసి పారిపోయాడు. ఈ దాడిలో గణేశన్ భార్య రేవతి, చిన్నారి వైష్ణవి సహా ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై గిండీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, విచారణ చేపట్టారు. గాయపడిన ఐదేళ్ల వైష్ణవి అనే చిన్నారి ఎగ్మూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. గణేశన్ సహా మరో ఐదుగురు స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా రు. ఆ యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.