బస్సు మెట్లపై నుంచి కిందపడిన విద్యార్థి | Sakshi
Sakshi News home page

బస్సు మెట్లపై నుంచి కిందపడిన విద్యార్థి

Published Sun, Nov 19 2023 1:48 AM

-

రెండు కాళ్లు తొలగింపు

అన్నానగర్‌: కున్రత్తూరు పక్కనే వున్న కొల్లచ్చేరి జంక్షన్‌ సమీపంలోని సేకిళార్‌ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థులు ఉదయం, సాయంత్రం రెండు పూటలా ప్రభుత్వ బస్సు మెట్లకు వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణించడం అలవాటు చేసుకున్నారు. ఈక్రమంలో 11వ తరగతి చదువుతున్న సంతోష్‌ (16) శునకం సాయంత్రం పాఠశాల ముగిసిన తరువాత అటుగా వెళుతున్న ప్రభుత్వ బస్సు మెట్లకు వేలాడుతూ వచ్చాడు. కున్రతూఓ్తరు తేరడి బస్సు దగ్గర రాగానే ఒక్కసారిగా కాలుజారి కింద పడిపోయాడు. అంతలో బస్సు వెనుక చక్రం అతని రెండు కాళ్లపైకి ఎక్కింది. ఇందులో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ప్రజలు వెంటనే రక్షించి చికిత్స నిమిత్తం చైన్నెలోని కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు పాదాల కింద తీవ్రంగా దెబ్బతినడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. విద్యార్థికి చికిత్స కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement