బకాయి నిధులు తక్షణం చెల్లించాలి
● విద్యా వ్యవస్థలను లోకేష్ భ్రష్టు పట్టించారు
● మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం
ఆమదాలవలస: రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారీగా ఫీజు బకాయిలు పెట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికి దక్కిందని మాజీ స్పీక ర్, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. ఆమదాలవలసలోని తన స్వగృహంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను చీకటిగా మారుస్తుందన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అవగాహన లేమితో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డా రు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది క్వార్టర్లకు గాను సుమా రు రూ.7,800 కోట్లు కాలేజీలకు బకాయిలుగా పెండింగ్‌లో ఉంచారన్నారు. ఎన్నికల సమయంలో నేరుగా కాలేజీలకు ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మొండి చేయి చూ పుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యా లు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని, అనేక చోట్ల సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో విద్యాదీవెన కింద రూ.12,609 కోట్లు క్రమం తప్పకుండా త్రైమాసికాల వారీగా చెల్లించడమే కాక, అప్పట్లో టీడీపీ పెట్టిన బకాయిలు కూడా కట్టేశారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ పాలనలో విద్యాదీవెన, వసతిదీవెన పథకాల కింద మొత్తం రూ.18,663 కోట్లు ఖర్చు చేసి విద్యార్థులకు పూర్తి భరోసా కల్పించారని తమ్మినేని గుర్తు చేశారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా విద్యార్థుల చదువుకు ఎ లాంటి ఇబ్బందులు రాకుండా చూసిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ అని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో పాఠశాలల నుంచి ఉన్నత విద్య వరకు మొత్తం వ్యవస్థ కుదేలైందన్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రైవేటు కాలేజీలు ‘మేము నడపలేము’ అంటూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. వెంటనే రూ.7,800 కోట్లు విడుదల చేయాలని కోరారు. సమావేశంలో తమ్మినేని చిరంజీవినాగ్ ఉన్నారు.


