ప్రతి కార్యాలయంలో ఈ–ఆఫీసు తప్పనిసరి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: వచ్చే వారానికల్లా జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ–ఆఫీసు వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన ప్రభుత్వ విభాగాల వారీగా దస్త్రాల పరిష్కారంపై మంగళవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. దస్త్రాల పరిష్కారంలో వేగం పెంచడానికి అధికారులను అ ప్రమత్తం చేసేందుకే ఈ సమీక్ష అని ఆయన తె లిపారు. ఆర్థికాంశాలతో ముడిపడని దస్త్రాల్ని, మరీ సంక్లిష్టమైన అంశమైతే తప్ప, వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ–ఆఫీసు దస్త్రాల పరిష్కారంలో వెనుకబడి న ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పలాస ము న్సిపాలిటీలు, ఏపీఎస్‌ఐడీసీ, జిల్లా రిజిస్ట్రార్ వంటి శాఖలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. సంతబొమ్మాళి మండలం తాళ్లవలసలో జరిగిన ఘటనపై కలెక్టర్ మాట్లాడుతూ, ఆహారం, నీరు, పారిశుద్ధ్యం విషయంలో జిల్లా మొత్తం ఆయా ప్రభుత్వ విభాగాలు అప్రమత్తంగా ఉండాలి అని స్పష్టం చేశారు. ఆహార కల్తీ విభాగానికి చెందిన అధికారులు హోటల్స్, సినిమా హాళ్లు, రోడ్డు సైడ్ ఫుడ్ స్టాళ్ల వద్దకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాలని, వారందరికీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. తనిఖీల పేరుతో వీధి వ్యాపారులను ఇబ్బంది పెట్టరాదని స్పష్టం చేశారు.
అలాగే పలు శాఖల ప్రగతి అంశాలపై, ముఖ్యంగా ధాన్యం సేకరణ అంశంలో బ్యాంక్ గ్యారెంటీలు, వాహనాల రిజిస్ట్రేషన్, టార్పా లిన్ల లభ్యతపై చర్చించారు. ఇటీవల వచ్చిన తుఫాను అనంతరం వర్షాల కారణంగా జరిగి న ధాన్యం నష్టం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పారిశుద్ధ్యం విషయంలో ఒక మోడల్ గ్రామాన్ని ఎంపిక చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ తదితర అధికారులు హాజరయ్యారు.


