ఆర్డీఓ వ్యాఖ్యలు హాస్యాస్పదం
మందస: కార్గో ఎయిర్‌పోర్టుకు సంబంధించి మందసలో ఆర్డీఓ వెంకటేష్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ చేసే ముందుకు వెళ్లామని పత్రికాముఖంగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు, కార్యదర్శి జోగి అప్పారావు అన్నారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ రాంపురం, బిడిమి గంగువాడ, అనకాపల్లి, సంతోష్‌నగర్ తదితర గ్రామాల్లో ఇప్పటికే రైతులు స్పష్టంగా తమ వైఖరి తెలియజేశారని చెప్పారు.
శతశాతం ఉత్తీర్ణత సాధించాలి
రణస్థలం: కేజీబీవీలో పది, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినులు శతశాతం ఉత్తీర్ణత సాధించాలని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యదర్శి(కేజీవీవీ) డి.దేవానంద రెడ్డి అన్నారు. లావేరు మండలం మురపాక కేజీబీవీని మంగళవారం తనిఖీ చేశారు. ఇటీవల క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. మధ్యాహ్న భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్‌వో సుధ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


