40 రోజులు
రూ.55.11లక్షలు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో హుండీ కానుకల లెక్కింపులో రూ. 55,11,915 మేరకు ఆదాయం లభించినట్లుగా ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ ప్రకటించారు. మంగళవారం ఆలయ అనివెట్టి మండపంలో నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపులో నగదు రూపంలో రూ.50,51,052, చిల్లర రూపంలో రూ.4,60,863 లభించిందని, అలాగే విదేశీ మారక ద్రవ్యంతో పాటు 45 గ్రాముల బంగారం, 992 గ్రాముల వెండి వస్తువులు లభించినట్లుగా ప్రకటించారు. గత 40 రోజుల పాటు హుండీల్లో ఉన్న కానుకలను లెక్కించినట్లుగా ఈఓ తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ఈఓలు జి.గురునాధరావు,ఎం.సుకన్య, పి.శ్యామలరావు పాల్గొన్నారు.


