
అంతుపట్టని ‘అధికారి’ వ్యూహం
● అయోమయంగా సచివాలయ మహిళా పోలీసుల బదిలీలు ● ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్లాలంటూ హుకుం! ● బదిలీల్లో రాష్ట్రం మొత్తం ఒక తీరు.. సిక్కోలులో మరో తీరు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో వార్డు, గ్రామ సచివాలయాల మహిళా పోలీసుల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదమవుతోంది. అంతుబట్టని ‘అధికారి’ వ్యూహంతో కౌన్సెలింగ్ అవ్వని మహిళా పోలీసులు ఉక్కిరిబిక్కిరవుతుండగా.. అయినవారు ఉసూరుమంటూ అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. మొన్నటికి మొన్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐల బదిలీల్లో కూడా ఇలాంటి విమర్శలే సదరు అధికారి ఎదుర్కొన్నారు. జంబ్లింగ్ పద్ధతి పేరిట చేస్తున్న ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అన్ని జిల్లాల్లో ఒక తీరులా.. శ్రీకాకుళం జిల్లాలో మరోలా జరుగుతోంది. ఎస్, నో క్యాటగిరీలుగా విభజించిన ఈ ప్రక్రియ కొందరికి నాలుగైదు మండలాల అవతలకు బదిలీ చేయగా.. మరికొందరికి పక్కపక్కన ఉన్న మండలాల్లోనే బదిలీ చేయడంతో అధికారి తీరు ఒకరికి మోదం.. మరొకరికి ఖేదంలా అనిపిస్తోంది. జిల్లాలో 930 గ్రామ సచివాలయాలు, 95 వార్డు సచివాలయాలకు గాను గురువారం రాత్రి దాదాపు 880 మంది మహిళా పోలీసులకు మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసినట్లు తెలిసింది.
నిబంధనలకు విరుద్ధంగా..
గతంలో ఆరోగ్య పరిస్థితి, ఇతర కారణాలతో నచ్చిన చోట పోస్టింగ్‌లకు రిక్వెస్టులుగా పెట్టుకోవడం, ఎంతకాలం చేశారన్న దాని ఆధారంగా కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసేది. ఇప్పుడు మాత్రం ‘ఎస్, నో’ అనే ఆప్షన్‌లు పెట్టారు. ఎస్ ఆప్షన్‌లో మూడు క్యాటగిరీలు ఉంటాయి.. 2500 మంది ఆ సచివాలయంలో జనాభా ఉంటే ఏ క్యాటగిరీ, ఆపై ఎక్కువ ఉంటే బీ, సీ క్యాటగిరీలుగా విభజించారు. నో ఆప్షన్ ప్రకారం ఆచోట భవిష్యత్తులో మహిళా పోలీసు ఉండరని అర్ధం. దీని ప్రకారం రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా, ర్యాంకుల వారీగా ఆ మండలంలో వేరే చోట గానీ, పక్క మండలంలో కానీ బదిలీ అవ్వాలి. దానికి విరుద్ధంగా బుధవారం జరిగే కౌన్సిలింగ్‌లో 1 సంఖ్య నుంచి 120 సంఖ్య వరకు టాపర్స్‌లో ఉన్నవారిని సైతం