
న్యాయమూర్తుల పోస్టులు భర్తీ చేయాలి
శ్రీకాకుళం పాత బస్టాండ్: జిల్లా కేంద్రంలో ఉన్న 15 న్యాయస్థానాల్లో పలు న్యాయమూర్తి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి భర్తీకి చర్యలు తీసుకోవాలని బార్ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. బుధవారం కోర్టు పాత బార్ కార్యాలయంలో జిల్లా బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు తంగీ శివప్రసాదరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు మూడు నెలల ఆదాయ, వ్యయాలు మరియు మూడు నెలల ప్రాగ్రెస్‌ను సభ్యులకు వివరించారు. అసోసియేషన్ సమస్యలపై చర్చించి తీర్మానం చేశారు. ముఖ్యంగా జిల్లాకోర్టు ప్రాంగణంలో ఖాళీగా ఉన్న మూడు కోర్టుల మేజిస్ట్రేట్ల నియామకం చేపట్టాలన్నారు. సమావేశంలో స్టేట్ బార్ మెంబర్ జి.వాసుదేవరావు, కార్యవర్గ సభ్యులు ఇప్పిలి సీతరాజు, భవానీ ప్రసాద్, కొమ్ము రమణమూర్తి, వనజాక్షి, శంకర్ సీనియర్లు, బీసీ న్యాయవాద సంఘం జిల్లా అధ్యక్షుడు ఆగూరు ఉమామహేశ్వరరావు, పూర్వ భారీ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు, న్యాయవాదులు అన్నెపు సత్యనారాయణ, పీవీ రమణరావు, పీవీ రమణ దయాల్, నాగభూషణం, విజయ్ కుమార్, సుభాష్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
● తీర్మానించిన బార్ సర్వసభ్య సమావేశం