శ్రీకాకుళం పాతబస్టాండ్: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సిబ్బంది రెమ్యూనరేషన్ డ్యూటీ సర్టి ఫికెట్లతో పాటు వేసవి సెలవులు కావున ఆ సమయంలో డ్యూటీ పీరియడ్‌గా పరిగణించాలని పీఆర్‌టీయూ, ఏపీటీఎఫ్ సంఘాలకు చెందిన నాయకులు సోమవారం కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆయ న చాంబర్‌లో వేర్వేరుగా కలిసి వినతి పత్రాలు అందజేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఏపీటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షులు మజ్జి మదన్మోహన్, జిల్లా కార్యదర్శి చావలి శ్రీనివాస్, సీనియర్ నాయకులు సదాశివుని శంకరరావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు తంగి మురళీమోహనరావు, ప్రధాన కార్యదర్శి దానేటి కేశవరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భైరి అప్పారావు, రాష్ట్ర సహోధ్యక్షులు పి.రాజశేఖర్ రావు, బి.రవికుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరణం సీతరాజు తదితరులు ఉన్నారు.