ఉమ్మడి జిల్లా ఉద్యోగుల ఆటవిడుపు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా ఉద్యోగుల ఆటవిడుపు

Dec 1 2025 7:20 AM | Updated on Dec 1 2025 7:20 AM

ఉమ్మడ

ఉమ్మడి జిల్లా ఉద్యోగుల ఆటవిడుపు

అనంతపురం కార్పొరేషన్‌: శ్రీసత్యసాయి జిల్లా పోలీసు, అనంతపురం జిల్లా రెవెన్యూ జట్లు ఆదివారం అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడాయి. పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీసత్యసాయి జిల్లా పోలీసు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. జట్టులో నాగేంద్రప్రసాద్‌ 31, ప్రభాకర్‌ 20, ఎస్పీ సతీష్‌కుమార్‌ 14, డీఎస్పీ మహేష్‌ 17 పరుగులు చేశారు. అనంతరం బరిలో దిగిన అనంత రెవెన్యూ జట్టు 17.5 ఓవర్ల వద్ద 95 పరులకు కుప్పకూలింది. జట్టులో రవితేజ 17, కలెక్టర్‌ ఆనంద్‌ 9 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 35 పరుగుల తేడాతో శ్రీసత్యసాయి జిల్లా పోలీసు జట్టు విజయం సాధించింది. శ్రీసత్యసాయి జిల్లా బౌలర్లలో ఎస్పీ సతీష్‌కుమార్‌ 4 వికెట్లు తీసుకుని ఆల్‌రౌండర్‌ ప్రతిభను కనబరిచారు.

ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడిగా గజ్జల హరిప్రసాదరెడ్డి

కదిరి: స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన ఎస్టీయూ జిల్లా వార్షిక కౌన్సిల్‌ సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మరోసారి గజ్జల హరిప్రసాద్‌రెడ్డి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా గోపాల్‌ నాయక్‌, ఆర్థిక కార్యదర్శిగా జయకృష్ణను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. మరో ఐదుగురిని అసోసియేట్‌ అధ్యక్షులుగా, తొమ్మిది మందిని ఉపాధ్యక్షులుగా, ఆరుగురిని రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా శివారెడ్డి, పరిశీలకులుగా రామాంజనేయులు వ్యవహరించారు.

వ్యక్తి ఆత్మహత్య

మడకశిర రూరల్‌: మండలంలోని హరేసముద్రం గ్రామానికి చెందిన దొడ్డయ్య (37) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు వివాహమై 14 ఏళ్లయింది. సంతానం కలగకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆయన శనివారం సాయంత్రం తన ఇంటి ఆవరణలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లలితమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

మొరాయిస్తున్న టౖర్బైన్‌

కూడేరు: పీఏబీఆర్‌ జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో ఈ నెల 22న తలెత్తిన టర్బైన్‌ సమస్య కొలిక్కి రాలేదు. ఈ నెల 23 నుంచి అధికారులు మరమ్మతులు చేయిస్తున్నా.. సమస్య తీరలేదు. దీంతో నిపుణుల కోసం వేచి ఉండాల్సి వస్తోంది. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి రిజర్వాయర్‌ అధికారులు తీసుకెళ్లినట్లుగా తెలిసింది.

వృద్ధురాలి బలవన్మరణం

గుంతకల్లు టౌన్‌: స్థానిక తిలక్‌నగర్‌లో నివాసముంటున్నజి.సుంకన్న భార్య రాములమ్మ(61) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని మెయిన్‌ రోడ్డులో ఓ లాడ్జి పక్కన సుంకన్న టీ స్టాల్‌ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో భార్య రాములమ్మ కొన్నేళ్లుగా డయాబెటిక్‌, తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది. దీనికి తోడు ఇటీవల మూత్ర విసర్జన సమస్య తీవ్రమైంది. దీంతో జీవితంపై విరక్తి చెందిన రాములమ్మ... ఆదివారం వేకువజామున బాత్‌రూమ్‌లోకి వెళ్లి టాయిలెట్‌ క్లీనింగ్‌ యాసిడ్‌ తాగింది. కాసేపటి తర్వాత బాత్‌రూం వద్దకెళ్లిన మనవడు.. అపస్మారక స్థితిలో పడి ఉన్న అవ్వను గమనించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఉదయం 7.30 గంటల సమయంలో ఆమె మృతిచెందింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్‌ఐ మంజుల తెలిపారు.

ఆటో బోల్తా .. ఒకరి మృతి

కూడేరు: ఆటో బోల్తాపడిన ఘటనలో కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన పర్వతయ్య(57) మృతిచెందాడు. ఆదివారం రాజప్పకు చెందిన ఆటోలో ఉజ్జనయ్యతో కలసి వెళుతుండగా గ్రామ శివారుకు చేరుకోగానే కొర్రకోడుకు చెందిన అమర్నాథ్‌ ద్విచక్ర వాహనంపై వెళుతూ అదుపు తప్పి ఆటోను ఢీకొన్నాడు. ఘటనలో ఆటో బోల్తాపడింది. కిందపడిన పర్వతయ్య, రాజప్ప, ఉజ్జనయ్య, అమర్నాథ్‌ గాయపడ్డారు. స్థానికులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికి పర్వతయ్య మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఉమ్మడి జిల్లా ఉద్యోగుల  ఆటవిడుపు 1
1/2

ఉమ్మడి జిల్లా ఉద్యోగుల ఆటవిడుపు

ఉమ్మడి జిల్లా ఉద్యోగుల  ఆటవిడుపు 2
2/2

ఉమ్మడి జిల్లా ఉద్యోగుల ఆటవిడుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement