సేంద్రియ పద్ధతులే శరణ్యం
జు
రొళ్ల: వ్యవసాయంలో ఘనమైన మార్పులు వచ్చాయి. రసాయనిక సాగును పక్కనపెట్టి సేంద్రియ పంటల సాగు వైపు రైతులు చూస్తున్నారు. ఒకప్పుడు చెత్తే కదా అని తీసిపారేసే పరిస్థితి కానీ ఇప్పుడు ఆ చెత్తే బంగారమైపోయింది. అది సేంద్రియ ఎరువుగా మారి సత్తా చాటుతోంది. రసాయనిక ఎరువులు భారంగా మారుతున్న ప్రస్తుత రోజుల్లో రూ.వేలల్లో పెట్టుబడి పెట్టిన తర్వాత పంటల దిగుబడి రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఈ క్రమంలో పెట్టుబడి వ్యయం నుంచి విముక్తి కలగాలంటే సేంద్రియ పద్ధతులే అనివార్యమయ్యాయి. మడకశిర నియోజకవర్గంలోని రొళ్ల, అగళి, గుడిబండ, అమరాపురంతో పాటు మడకశిర మండలాల్లో మొత్తం 35,258 మంది రైతులు, 76,948 ఎకరాల విస్తీర్ణంలో మెట్ట, మాగాణి భూములను సాగుచేస్తున్నారు. రసాయనిక ఎరువుల వినియోగంతో భూసారం తగ్గి పంటల దిగుబడి లేక ఇంత కాలం ఇబ్బంది పడుతూ వచ్చారు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా సేంద్రియ ఎరువుల వినియోగంపై దృష్టి సారించిన రైతులు భూమిని సారవంతం చేసుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధిస్తూ ఇతర రైతులకు మార్గదర్శకంగా నిలిచారు.
ఖర్చు తక్కువ
పశువుల పేడ, కోడిపెంట, చీకిన గడ్డితో పాటు చెరువులు, కుంటల్లోని సారవంతమైన పూడికతీత మట్టిని రైతులు తమ పొలాలకు తరలించి భూమిలో సారం పెంచుకుంటున్నారు. పశు సంపదలేని రైతులు కోళ్ల ఫారాల్లోని కోడి పెంట, చెరువు, కుంటల్లోని సారవంతమైన పూడికతీత మట్టిని కొనుగోలు చేసుకుని పొలాల్లో వేసుకుంటున్నారు. బోరుబావుల కింద వేరుశనగ, వరి, రాగి, మిరప, గుమ్మడి, కీరదోస సాగుతో పాటు పూలతోటలు, కళింగర, కూరగాయల సాగు, దానిమ్మ, అరటి, బొప్పాయి తదితర పంటలను అత్యధికంగా సాగు చేస్తున్నారు.
పంటల సాగులో ఫలితాలు ఇస్తున్న సేంద్రియ ఎరువులు
ఒకసారి చల్లితే మూడు పంటల వరకు దిగుబడి
ఆసక్తి చూపుతున్న అన్నదాతలు


