నేటి నుంచి ఆంధ్ర, కర్ణాటక మధ్య టెస్ట్ మ్యాచ్
అనంతపురం కార్పొరేషన్: కూచ్ బిహార్ అండర్ –19 క్రికెట్ ట్రోఫీలో భాగంగా సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు ఆంధ్ర, కర్ణాటక జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆర్డీటీలోని రాయలసీమ క్రికెట్ మైదానాన్ని సిద్ధం చేశారు. ఆదివారం ఇరు జట్ల క్రీడాకారులు నెట్స్‌లో ముమ్మర సాధన చేశారు. భారత మాజీ ఆటగాడు, కోచ్ రాహుల్ ద్రావిడ్ కుమారుడు అన్వయ్ ద్రావిడ్ కర్ణాటక జట్టు కెప్టెన్‌గా బరిలో దిగుతున్నాడు.
నేడు పింఛన్ల పంపిణీ
పుట్టపర్తి అర్బన్: సామాజిక భద్రతా పింఛన్లను సోమవారం నుంచి పంపిణీ చేయనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ నరసయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్
పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలో 80 మంది రౌడీషీటర్లు, పాత నేరస్తులకు ఆదివారం ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తిని వీడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ముగిసిన రాష్ట్ర స్థాయి జూడో పోటీలు
ధర్మవరం రూరల్: మండలంలోని చిగిచెర్ల గ్రామంలో రెండు రోజులుగా సాగిన ఎస్‌జీఎఫ్ అండర్–17, 19 రాష్ట్ర స్థాయి జూడో పోటీలు ఆదివారం ముగిశాయి. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. బాలికల విభాగంలో అనంతపురం క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్ షిప్‌ను దక్కించుకున్నారు. అండర్–19లో బాలుర విభాగంలో చిత్తూరు జిల్లా క్రీడాకారులు విజయం సాధించారు. తృతీయ స్థానంలో నెల్లూరు జిల్లా క్రీడాకారులు నిలిచారు. విజేతలను అభినందిస్తూ పరిటాల శ్రీరామ్, జనసేన నేత మధుసూదన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఓబిరెడ్డి బహుమతులు ప్రదానం చేశారు.
నేటి నుంచి ఆంధ్ర, కర్ణాటక మధ్య టెస్ట్ మ్యాచ్


