కలుషిత ఆహారం అందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

కలుషిత ఆహారం అందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి

Jul 5 2025 6:12 AM | Updated on Jul 5 2025 6:12 AM

కలుషి

కలుషిత ఆహారం అందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి

వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకుల డిమాండ్‌

ధర్మవరం రూరల్‌/పుట్టపర్తి: సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లిలోని కేజీబీవీలో గురువారం కలుషిత ఆహారం అందించి 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పురుషోత్తం రాయల్‌, వేముల అమర్‌నాథ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ధర్మవరంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

యువకుడి ఆత్మహత్య

పరిగి: ఉద్యోగం రాలేదన్న బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పరిగి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన శ్రీరాములు కుమారుడు కురుబ సోమశేఖర్‌ (29) మెకానికల్‌ విభాగంలో డిప్లొమా పూర్తి చేసి, నాలుగేళ్ల పాటు బెంగళూరులోని ఓ కంపెనీలో పనిచేశాడు. రెండు నెలల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. సొంతూరిలోనే మేకలను కాచుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఇక తనకు ఉద్యోగం రాదన్న బెంగతో గురువారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు తన తల్లి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం వేకువజామున ఇంటికి చేరుకున్న తల్లి తిప్పక్క ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమారుడిని చూసి బోరున విలపించింది. చుట్టుపక్కల వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. తండ్రి శ్రీరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ రంగడు యాదవ్‌ తెలిపారు.

ఆక్రమణలు తొలగించకుండానే స్నాన ఘట్టాల నిర్మాణం

పుట్టపర్తి అర్బన్‌: సత్యసాయి శతజయంతి వేడుకలను పురస్కరించుకుని చిత్రావతి నదిలో నిర్మిస్తున్న స్నాన ఘట్టాలు విమర్శలకు తావిస్తున్నాయి. మరో నాలుగు నెలల్లో సత్యసాయి శత జయంతి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం చిత్రావతి నది ఒడ్డున స్నాన ఘట్టాలు, నది తీరం వెంబడి ఇరువైపులా సుమారు కిలోమీటరుకు పైగా రాతితో బండింగ్‌ పనులు, నది మధ్యన సత్యసాయి బాబా విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందు కోసం దాదాపు రూ.3.5 కోట్లను వెచ్చిస్తున్నారు. అయితే స్నాన ఘట్టాలు ఏర్పాటు చేసే స్థలం చాలా వరకూ ఆక్రమణకు గురైంది. ఇలాంటి తరుణంలో ఆక్రమణలు తొలగించకుండా నిర్మాణాలు చేపట్టడం వివాదాస్పదమవుతోంది. ఆక్రమణలు తొలగించకపోతే నది కుచించుకుపోయి, భారీ వర్షాలు కురిస్తే వరద మొత్తం పట్టణంలోకి చొరబడి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తొలుత ఆక్రమణలు తొలగించిన తర్వాతనే స్నాన ఘట్టాలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు.

కలుషిత ఆహారం అందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి1
1/2

కలుషిత ఆహారం అందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి

కలుషిత ఆహారం అందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి2
2/2

కలుషిత ఆహారం అందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement