
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ బసంత్‌కుమార్
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని కలెక్టర్ బసంత్‌కుమార్ ఆదేశించారు. సింగిల్ డెస్క్ విధానంలో అనుమతులన్నీ మంజూరు చేయాలన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పీఎంఈజీపీ పథకం వలంటీర్ల ద్వారా కరపత్రాలు అందజేసి పరిశ్రమలు స్థాపించేలా యువతకు అవగాహన కల్పించాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సాయం అందించాలన్నారు. జిల్లాకు కేటాయించిన ‘స్టాండప్ ఇండియా’ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. సింగిల్ డెస్క్ విధానం, గడువులోపు గ్రీవెన్స్‌లు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం 14 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు మంజూరు చేయాల్సిన పెట్టుబడి సబ్సిడీ ప్రతిపాదనలను కమిటీ ఆమోదించింది. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి చాంద్‌బాషా, పర్యావరణ శాఖ అధికారి శంకర్‌రావు, ఏపీఎస్‌పీడీసీఎల్ డీఈఈ మోజెస్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మురళీమోహన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సాయినాథరెడ్డి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజర్ ప్రకాష్, జిల్లా ఫైర్ ఆఫీసర్ శంకరప్రసాద్, దళిత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా కోఆర్డినేటర్ వెంకటరమణ, గంగాధర్, ప్రసాద్, అహుడా వైస్ చైర్మన్ నరేష్‌కృష్ణ, ముణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
డీఐఈపీసీ సమావేశంలో కలెక్టర్ బసంత్‌కుమార్