మద్యం, చీరలు స్వాధీనం | Sakshi
Sakshi News home page

మద్యం, చీరలు స్వాధీనం

Published Sun, May 5 2024 3:00 AM

-

నెల్లూరు(క్రైమ్‌): అక్రమంగా తరలిస్తున్న మద్యం, ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతకాలంగా పోలీసు అధికారులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు తనిఖీలు చేపట్టారు. నవాబుపేట పరిధిలో ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న రూ.2 లక్షలు విలువ చేసే 669 చీరలను స్వాధీనం చేసుకున్నారు. కలువాయి పరిధిలో 45, ఏఎస్‌పేటలో 7, ఉదయగిరిలో 16, కావలి రూరల్‌లో 98, కండలేరులో 10, సోమశిలలో 10, ఎస్‌ఈబీ అధికారులు 141 మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుని నిందితులపై కేసులు నమోదు చేశారు. సోమశిలలో 800 లీటర్ల బెల్లపుఊటను ధ్వంసం చేశారు.

Advertisement
 
Advertisement