●శేష వాహనంపై శ్రీవారు | Sakshi
Sakshi News home page

●శేష వాహనంపై శ్రీవారు

Published Fri, May 24 2024 12:45 AM

●శేష వాహనంపై శ్రీవారు

రాయదుర్గంటౌన్‌: స్థానిక కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం దేవేరులతో కలసి శేషవాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో ఽప్రత్యేక పూజలు, అభిషేకాలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం కుర్నిశెట్టి సంఘం ఆధ్వర్యంలో మేళతాళాలతో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటరమణ స్వామి ఉత్సవ మూర్తులను శేషవాహనంపై అధిష్టింపజేసి కోట, మొలకాల్మూరు రోడ్డు, వినాయక సర్కిల్‌, బళ్లారి రోడ్డు, బొడ్డురాయి వరకూ ఊరేగించారు. అనంతరం ఆలయానికి చేర్చారు. శుక్రవారం హనుమద్‌ వాహన సేవలు ఉంటాయని ఆలయ ఈఓ నరసింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన్‌ పాలాక్షిరెడ్డి, సభ్యులు రేకులకుంట సత్యనారాయణశెట్టి తదితరులు పాల్గొన్నారు.

25న శ్రీవారి కల్యాణోత్సవం

ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీ శనివారం విశిష్ట సంప్రదాయంలో ప్రసన్న వేంకటరమణుడి కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఈఓ నరసింహారెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 11.30 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం ఉంటుందన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement