రెడ్డిపల్లిలో చీనీచెట్ల నరికివేత | Sakshi
Sakshi News home page

రెడ్డిపల్లిలో చీనీచెట్ల నరికివేత

Published Fri, May 24 2024 12:45 AM

రెడ్డిపల్లిలో చీనీచెట్ల నరికివేత

పెద్దపప్పూరు: సమస్యాత్మక గ్రామంగా గుర్తించిన పెద్దపప్పూరు మండలంలోని రెడ్డిపల్లిలో కక్షలకు ఆజ్యం పోస్తూ చీనీ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. వివరాలు... గ్రామానికి చెందిన మహిళా రైతు వెంకటలక్ష్మి తనకున్న రెండు ఎకరాల పొలంలో 250 చీనీ చెట్లను సాగు చేశారు. గురువారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు తోటలోకి చొరబడి దాదాపు 189 చెట్లను నరికివేశారు. తెల్లవారిన తర్వాత అటుగా వెళ్లిన రైతులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో రైతు వెంకటలక్ష్మి, కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సైతం అక్కడకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. చెట్ల నరికవేతకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు బాధిత రైతు వెంకటలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ శరత్‌చంద్ర కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
 
Advertisement