పన్ను మోసాలపై విజి‘లెన్స్‌’ | Sakshi
Sakshi News home page

పన్ను మోసాలపై విజి‘లెన్స్‌’

Published Fri, May 24 2024 12:45 AM

పన్ను

సాక్షి, విశాఖపట్నం : నకిలీ ఇన్‌వాయిస్‌ల పేరుతో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ సొమ్ము దోచుకుంటున్న కంపెనీలపై కేంద్ర, రాష్ట్ర పన్నుల శాఖల పరిధిలోని విజిలెన్స్‌ అధికారులు దృష్టిసారించారు. ‘పన్నుమోసం.. చెరో సగం’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై విజిలెన్స్‌ అధికారులు ఆరా తీశారు. గత ఏడాదిన్నర కాలంలో వచ్చిన ఇన్‌వాయిస్‌ల డేటా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అదేవిధంగా వరుసగా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పొందుతున్న సంస్థల వివరాలు పరిశీలిస్తున్నారు. ఏఏ సంస్థలు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ సొంతం చేసుకున్నాయి.. ఆ సంస్థల అడ్రస్‌లు ఏంటి.. ఏఏ ఇన్‌వాయిస్‌లను సబ్మిట్‌ చేసి.. క్రెడిట్స్‌ పొందాయి.. ఇలా విభిన్న కోణాల్లో విజిలెన్స్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

సంజీవని నిధికి హెచ్‌పీసీఎల్‌ ఉద్యోగుల విరాళం

మహారాణిపేట: జిల్లాలోని పేదలు, అనారోగ్య బాధితులకు సాయం చేయాలనే దృక్పథంతో నెలకొల్పిన సంజీవని నిధికి హెచ్‌పీసీఎల్‌ ఉద్యోగులు రూ. 6,45,000 విరాళంగా అందించారు. హెచ్‌పీసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి.రతన్‌ రాజ్‌ గురువారం కలెక్టర్‌ ఎ. మల్లికార్జునను కలిసి ఈ మొత్తం చెక్కును అందజేశారు. విశాఖ రిఫైనరీలో పని చేస్తున్న ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంజీవని నిధికి ఆర్థిక సాయం అందించారని ఈడీ తెలిపారు. ఉద్యోగుల చూపిన చొరవ, దాతృత్వాన్ని కలెక్టర్‌ ప్రశంసించారు.

అర్హులందరికీ బీసీజీ వ్యాక్సినేషన్‌

మహారాణిపేట: అర్హులందరికీ బీసీజీ వ్యాక్సినేషన్‌ ఇస్తున్నామని డీఎంహెచ్‌వో పి.జగదీశ్వరరావు అన్నారు. గురువారం రేసపువానిపాలెంలోని తన కార్యాలయంలో డిస్ట్రిక్ట్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ సమావేశం జరిగిందని తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారికి బీసీజీ వ్యాక్సినేషన్‌ వేస్తున్నామన్నారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పంచాయతీల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామ న్నారు. అడిషనల్‌ డీఎంహెచ్‌వో పూర్ణేంద్రబాబు మాట్లాడుతూ అడల్ట్‌ బీసీజీ వాక్సిన్‌ త్వరితగతిన అందరూ వేసుకోవాలని, ఇది టీబీ రాకుండా చేస్తుందన్నారు. జిల్లా ఇమ్యూనిజేషన్‌ అధికారి జీవన రాణి, డ్రగ్‌ కంట్రోలర్‌ ఏడీ విజయ్‌కుమార్‌, యూఎన్‌డీపీ పీవో కమలాకర్‌ భట్టు, జిల్లా మీడియా విస్తరణాధికారి బి.నాగేశ్వరరావు, నోడల్‌ అధికారి బి.ఉమావతి పాల్గొన్నారు.

పన్ను మోసాలపై విజి‘లెన్స్‌’
1/1

పన్ను మోసాలపై విజి‘లెన్స్‌’

Advertisement
 
Advertisement
 
Advertisement