
ఘటనా స్థలంలో సాధిక్, అనిల్ మృతదేహాలు
ఇందుకూరుపేట: గణేశ్ నిమజ్జనానికి బైక్‌పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండలంలోని పున్నూరు క్రాస్‌రోడ్డు వద్ద గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు..నెల్లూరు రూరల్ పరిధిలోని మూడో మైలుకు చెందిన బోరి హరికృష్ణ, షేక్ సాధిక్(21), బడ్డి అనిల్(24) స్నేహితులు. వారి వీధిలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథుడి ప్రతిమను మైపాడు బీచ్‌లో నిమజ్జనం చేసేందుకు గురువారం రాత్రి తరలించారు. ఈ క్రమంలో ముగ్గురు స్నేహితులు బైక్‌పై మైపాడు బీచ్‌కు బయలుదేరారు. మార్గం మధ్యలో పున్నూరు క్రాస్‌రోడ్డు వద్ద ఏం జరిగిందో ఏమో ప్రమాదానికి గురై సాధిక్, అనిల్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో స్నేహి తుడు హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. హరికృష్ణను చికిత్స నిమిత్తం 108 వాహనంలో నెల్లూరు తరలించారు. కాగా బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైందా లేదా మరేదైనా వాహనం ఢీకొందా అనే విషయం తెలియరాలేదు. ఇన్‌చార్జి ఎస్సై రంగనాథ్‌గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరు యువకుల దుర్మరణం
మరో యువకుడికి తీవ్రగాయాలు