T20 World Cup India Vs New Zealand: Virat Kohli Comments About Team India In Press Meet - Sakshi
Sakshi News home page

IND Vs NZ: హార్దిక్‌ తుది జట్టులోనే.. శార్దూల్‌కు అవకాశం; కోహ్లి క్లారిటీ

Oct 30 2021 6:57 PM | Updated on Oct 31 2021 8:52 AM

T20 World Cup 2021: Kohli Says Hardik Pandya Play And Shardul Also Vs NZ - Sakshi

IND Vs NZ Match Ahead Kohli Press Meet.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా రేపు(అక్టోబర్‌ 31న) న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్‌ ఆడనుంది. క్వార్టర్స్‌లా భావిస్తున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలని అభిమానులు భావిస్తున్నారు. అయితే పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా దారుణ పరాభవం తర్వాత తుది జట్టులో ఏమైనా మార్పులు ఉంటాయని అంతా భావిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై కోహ్లి క్లారిటీ ఇచ్చాడు. కివీస్‌తో మ్యాచ్‌కు సన్నద్దమవుతున్న వేళ కోహ్లి ప్రెస్‌ కాన్పరెన్స్‌లో మాట్లాడాడు. 

చదవండి: T20 World Cup 2021: ధోని వద్దన్నా.. కోహ్లి వినలేదా?

''కివీస్‌తో మ్యాచ్‌ను ఎలా గెలవాలనేదానిపై ఒక ప్రణాళిక రచించుకున్నాం. ఇక తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. హార్దిక్‌ పాండ్యా విషయంలో మాకు క్లారిటీ ఉంది. అతను ఫిట్‌గానే ఉన్నాడు.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఆడబోతున్నాడు.. కానీ బౌలింగ్‌ మాత్రం చేయడు. ఇక శార్దూల్‌ ఠాకూర్‌ తుది జట్టులోకి తీసుకొచ్చే విషయమై ఆలోచిస్తున్నాం. బ్యాటింగ్‌ లైనఫ్‌ బాగానే ఉండడంతో అందులో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. ఇక పాక్‌తో మ్యాచ్‌లో జరిగిన పొరపాట్లను న్యూజిలాండ్‌పై జరగకుండా జాగ్రత్తపడతాం. కివీస్‌పై మ్యాచ్‌ గెలిచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటాం'' అంటూ చెప్పుకొచ్చాడు. 

చదవండి: Ishan Kishan: ఇషాన్‌ ఓపెనర్‌గా వస్తే దుమ్మురేపడం ఖాయం

కోహ్లి వ్యాఖ్యలను బట్టి చూస్తే టీమిండియా జట్టులో పెద్ద మార్పులేం జరగకపోవచ్చనిపిస్తుంది. సూర్యకుమార్‌కు మరో అవకాశం ఇవ్వాలని భావిస్తే ఇషాన్‌ కిషన్‌ మరోసారి బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా వరుణ్‌ చక్రవర్తి వైపే కోహ్లి మొగ్గుచూపనుండడంతో అశ్విన్‌ కూడా బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంది. ఇక భువనేశ్వర్‌ కుమార్‌ స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ ఆడే అవకాశం ఉంది.

చదవండి: Babar Azam: కోహ్లి రికార్డును బ్రేక్‌ చేసిన బాబర్ ఆజమ్‌,కోహ్లిని వెంటాడుతున్న ఆజమ్‌ అంటూ..

న్యూజిలాండ్‌తో టీమిండియా తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి(కెప్టెన్‌), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, వరుణ్ చక్రవర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement