Smriti Mandhana Stunning Performance Help Southern Brave Win - Sakshi
Sakshi News home page

Smriti Mandhana: స్మృతి మంధనా విధ్వంసం; 16 బంతులు మిగిలి ఉండగానే

Jul 28 2021 11:21 AM | Updated on Jul 28 2021 1:53 PM

Smriti Mandhana Stunning Performance Clinch Victory Southern Brave 100 Balls - Sakshi

కార్డిఫ్‌: ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న హండ్రెడ్‌ బాల్‌ వుమెన్‌ కాంపిటీషన్‌ టోర్నీలో భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన దుమ్మురేపింది. సదరన్ బ్రేవ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మంధాన  39 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులతో నాటౌట్‌గా నిలవడమేగాక ఒంటిచేత్తో జట్టును గెలిపించింది. మంధాన మెరుపులతో మరో 16 బంతులు మిగిలి ఉండగానే సదరన్‌ బ్రేవ్‌ విజయాన్ని అందుకుంది. మంధాన బ్యాటింగ్‌ విషయాన్ని పరిశీలిస్తే.. మొదటి 25 బంతులకు 29 పరుగులు చేసిన స్మృతి ఆ తరువాతి 14 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 32 పరుగులు చేసింది.


మంధాన బ్యాటింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన వెల్ష్‌ ఫైర్‌ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. వెల్ష్‌ ఫైర్‌ బ్యాటింగ్‌లో హెలీ మాథ్యూస్‌ 33 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. జార్జియా హెనెస్సీ 23 నాటౌట్‌గా నిలిచింది. సదరన్‌ బౌలింగ్‌లో లారెన్‌ బెల్‌, వెల్లింగ్‌టన్‌ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సదరన్‌ బ్రేవ్‌ వుమెన్‌ 84 బంతుల్లోనే లక్ష్యాన్ని చేరుకుంది. స్మృతి 61 నాటౌట్‌, స్టఫానీ టేలర్‌ 17 నాటౌట్‌గా నిలిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement