IPL 2022: డుప్లెసిస్, సంజయ్ సూపర్.. కోహ్లి కెప్టెన్‌గా ఉంటే ఇది సాధ్యమయ్యేదా!

IPL 2022 RCB- Virender Sehwag Comments: ఐపీఎల్-2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్రలో హెడ్ కోచ్ సంజచ్ బంగర్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌దే కీలక పాత్ర అని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. వారిద్దరి విధానాల వల్లే జట్టు ప్లే ఆఫ్స్‌నకు చేరుకోగలిగిందని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. జట్టులో పెద్దగా మార్పులు చేయకుండా మంచి ఫలితాలు రాబట్టారని కొనియాడాడు.
నిలకడైన ఆట తీరుతో ఆర్సీబీ ఈ ఏడాది ఆకట్టుకుందని పేర్కొన్నాడు. ఒకవేళ కోహ్లిలా సంజయ్, డుప్లెసిస్ ఆలోచించి ఉంటే ఇది సాధ్యం కాకపోయేదేమోనని అభిప్రాయపడ్డాడు. కాగా గత ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ మెగా వేలం-2022లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను కొనుగోలు చేసిన యాజమాన్యం అతడిని కెప్టెన్‌గా నియమించింది.
వీరేంద్ర సెహ్వాగ్
ఈ క్రమంలో ఈ ఎడిషన్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి 16 పాయింట్లతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుకుంది. అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ టైటిల్‌ను ఎలాగైనా గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022లో ఆర్సీబీ ప్రదర్శన గురించి సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రెడిట్ మొత్తం హెడ్‌కోచ్ సంజయ్ బంగర్, కెప్టెన్ డుప్లెసిస్‌కే చెందుతుందన్నాడు.
‘‘సంజయ్ బంగర్ హెడ్‌కోచ్‌గా రావడం.. కొత్త కెప్టెన్ చేరిక ఆర్సీబీ వ్యూహాల్లో మార్పులు తీసుకువచ్చింది. గతంలో విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఉన్నపుడు.. ఒక ఆటగాడు 2-3 మ్యాచ్‌లలో సరిగా ఆడకపోతే తుదిజట్టు నుంచి తప్పించే వాడు. కానీ బంగర్, డుప్లెసిస్ టోర్నీ ఆసాంతం ఒకరిద్దరు మినహా అందరినీ కొనసాగించారు.
అనూజ్ రావత్ మినహా చెత్త ప్రదర్శన కారణంగా వారు ఎవరినీ పక్కనపెట్టిన దాఖలాలు కనిపించలేదు. నిలకడగా ముందుకు సాగడం వారికి కలిసి వచ్చింది’’ అని సెహ్వాగ్ క్రిక్‌బజ్‌తో తన అభిప్రాయం పంచుకున్నాడు. ఇక గతంలో కోహ్లి, డివిల్లియర్స్ ఉంటే ప్రత్యర్థులు భయపడేవారని.. ఈసారి దినేశ్ కార్తిక్, గ్లెన్ మాక్స్‌వెల్ కూడా వారి పాలిట సింహస్వప్నంలా మారారని కితాబిచ్చాడు.
చదవండి👉🏾IPL 2022: గొప్ప నాయకుడు.. కెప్టెన్‌గా అతడికి వందకు వంద మార్కులు వేస్తాను!
చదవండి👉🏾IPL 2022: వర్షం పడితే కథేంటి.. ఫైనల్ చేరే దారులు ఎలా ఉన్నాయంటే!
The King has his 👀 focused on the prize.
Less than 👆 day to go.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/w4jw67crSs
— Royal Challengers Bangalore (@RCBTweets) May 24, 2022
మీ అభిప్రాయం చెప్పండి
మరిన్ని వార్తలు