అభిషేక్‌ విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్‌ | IND VS WI 3rd T20I: Team india all out for 223 runs | Sakshi
Sakshi News home page

అభిషేక్‌ విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్‌

Oct 11 2026 8:51 PM | Updated on Oct 11 2026 8:51 PM

IND VS WI 3rd T20I: Team india all out for 223 runs

source: X

ఇండోర్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (30 బంతుల్లో 69; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకంతో విరుచుకుపడగా.. ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 37; 6 ఫోర్లు, సిక్స్‌), తిలక్‌ వర్మ (28), నితీశ్‌ కుమార్‌ (21), అక్షర్‌ పటేల్‌ (20) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. 

ఆఖర్లో నమన్‌ ధిర్‌ (10), అర్షదీప్‌ సింగ్‌ (11), ప్రిన్స్‌ యాదవ్‌ (13 నాటౌట్‌) కూడా బ్యాట్‌ ఝులిపించారు. భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్‌ (3), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (1) నిరాశపరిచారు. విండీస్‌ బౌలర్లలో ఛేజ్‌, షమార్‌ జోసఫ్‌, షమార్‌ స్ప్రింగర్‌ తలో 2 వికెట్లు తీయగా.. కీమో పాల్‌, గుడకేశ్‌ మోటీ చెరో వికెట్‌ పడగొట్టారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌, విండీస్‌ రెండో మ్యాచ్‌లో గెలిచిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ.. ప్రపంచ రికార్డు బద్దలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement