వైరల్‌: ధోని వయసును విమర్శిస్తూ ఇర్ఫాన్‌ ట్వీట్‌

Former Cricketer Irfan Patan Tweet on MS Dhoni Age - Sakshi

దుబాయ్‌ : జరిగిన  ఐపీఎల్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్లు పోటీపడిన సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌ 165 రన్స్‌ టార్గెట్‌ను ఛేజ్‌ చేయలేక చెన్నై టీం సతమతమయ్యింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని  చివరి రెండు ఓవర్లలలో చాలా ఇబ్బంది పడ్డారు. మధ్యమధ్యలో ఆగుతూ బ్యాటింగ్‌ చేశాడు. అయినప్పటికి ధోని తన టీంను గెలిపించలేకపోయాడు. ఈ విషయంలో మాజీ క్రికెటర్‌, ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, ధోనిపై అతనిపేరు ప్రస్తావించకుండా విమర్శనాస్త్రాలు సంధిస్తూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. నిన్న రాత్రి ధోని ఆట తీరు చూసే ఇర్ఫాన్‌ ఇలా ట్వీట్‌ చేశాడని చాలా మంది భావిస్తున్నారు. 

‘వయసు అనేది కొందరికి నంబర్‌ మాత్రమే, అదే కొందరు తప్పుకోవడానికి కారణమవుతుంది’ అంటూ ఇర్ఫాన్‌ ట్వీట్‌ చేశారు. ఇక ఐపీఎల్‌లో ధోని ఆట తీరు చూసిన వారు ఆయన ఫిట్‌నెస్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2019 జూలై తరువాత ధోని ఇప్పుడే బ్యాట్‌ పట్టుకున్నాడు. ఇక వాతావరణం సరిపడకే తాను ఇబ్బంది పడ్డను అని అంతకు మించి ఏం లేదని, తన అభిమానులు ఎవరు కంగారుపడొద్దని ధోని చెప్పారు.

చదవండి: అప్పుడు ట్రోల్‌ చేసి ఇప్పుడు జాలి చూపిస్తున్నారా! 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top