జిల్లాలో 208 ప్రీ ప్రైమరీ పాఠశాలలు
హుస్నాబాద్‌రూరల్: జిల్లాలో 208 ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. మొదటి విడత సిద్దిపేట డివిజన్‌లో 110 మంది ఇన్‌స్ట్రక్చర్స్‌కు శిక్షణ ఇచ్చామని, రెండో విడుత గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్‌లో వంద మందికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ప్రీ ప్రైమరీ పాఠశాలలను అందంగా అలంకరించి విద్యార్థులను ఆకట్టుకునేలా తయారు చేయాలని చెప్పారు. ఆట పాటలతో విద్యా బోధన చేస్తే పిల్లలకు సులభంగా అర్థమవుతుందన్నారు.


