దుబ్బాకపై సీఎం రేవంత్ వివక్ష
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక: నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి వివక్ష చూపడం సమంజసం కాదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం దుబ్బాక మున్సిపాలిటీలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్‌లో జరిగిన సభలో సీఎం.. దుబ్బాక అభివృద్ధిపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గం అన్ని రకాలుగా అన్యాయానికి గురవుతోందన్నారు. రెవెన్యూ డివిజన్‌తో పాటు మల్లన్నసాగర్ కాల్వలు పూర్తి చేయాలని ఎన్నోమార్లు సీఎంకు విన్నవించినా ఫలితం లేదన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఎం, మంత్రులను కలిసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.


