వైభవంగా శివపార్వతుల కల్యాణం
శివపార్వతుల ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో భక్తజనం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని సుందర సత్సంగ్ భవన్‌లో బుధవారం శివపార్వతుల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. లాల్‌కమాన్ ఆర్యవైశ్య ఫ్యామిలీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతోష్ మాత ఆలయం నుంచి శివపార్వతుల ఉత్సవ మూర్తులను పట్టణంలోని ప్రధాన వీధులగుండా సుందర సత్సంగం వరకు ఊరేగించారు. మహిళలు కోలాటాలతో దేవ దేవతలకు స్వాగతం పలికారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయి ద్యాల మధ్య కల్యాణం కమనీయంగా సాగింది. శివనామస్మరణతో కల్యాణమండపం మార్మోగింది.
వైభవంగా శివపార్వతుల కల్యాణం


