7 నుంచి ‘మల్లన్న’ మూలవిరాట్‌ దర్శనం నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

7 నుంచి ‘మల్లన్న’ మూలవిరాట్‌ దర్శనం నిలిపివేత

Dec 4 2025 9:08 AM | Updated on Dec 4 2025 9:08 AM

7 నుం

7 నుంచి ‘మల్లన్న’ మూలవిరాట్‌ దర్శనం నిలిపివేత

7 నుంచి ‘మల్లన్న’ మూలవిరాట్‌ దర్శనం నిలిపివేత పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌ అగ్నివీర్‌ శిక్షణ పూర్తి చేసిన యువకులు మోర్‌ సూపర్‌ మార్కెట్‌కు జరిమానా మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యం

కొమురవెల్లి(సిద్దిపేట):మల్లన్న స్వామి మూల విరాట్‌ దర్శనాన్ని ఈనెల 7వతేదీ రాత్రి 8:30 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈఓ టంకసాల వెంకటేశ్‌ బుధవారం తెలిపారు. ఈనెల 14న స్వామి వారి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్ల మూల విరాట్‌ల అలంకరణ నిమిత్తం దర్శనం నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 14న ఉద యం ఆరు గంటల నుంచి పునఃదర్శనం కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మూల విరాట్‌ దర్శనం నిలిపివేసిన రోజులలో అర్ధమండపంలో ఉత్సవ విగ్రహాల దర్శనం, పూజలు ఉంటాయన్నారు.

కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి పంచాయతీ కార్యదర్శి హరిప్రసాద్‌ను సస్పెండ్‌ చేసినట్లు ఎంపీడీఓ లక్ష్మప్ప బుధవారం తెలిపారు. గతంలో కొండపాక మండలం అంకిరెడ్డిపల్లిలో నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలడంతో చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీఓ చెప్పారు.

నంగునూరు(సిద్దిపేట): అగ్నివీర్‌గా ఎంపికై ఆరు నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న నంగునూరు మండల యువకులు బుధవారం ఉద్యోగ నియామక పత్రం అందుకున్నారు. పాలమాకులకు చెందిన తోకల సంతోష్‌, కొండంరాజ్‌పల్లికి చెందిన బండి శ్రీనివాస్‌, మగ్దుంపూర్‌కు చెందిన ఓరిగంటి రాహుల్‌ శిక్షణా కాలం పూర్తయింది. బుధవారం బెంగళూర్‌లోని ఆర్మీసర్వీస్‌ క్యాంప్‌ సెంటర్‌లో అధికారుల చేతుల మీదుగా పథక్‌ పట్టా అందజేశారు. హరియాణాలోని ట్రైనింగ్‌ సెంటర్‌లో విధులు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): కాలం చెల్లిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న మోర్‌ సూపర్‌ మార్కెట్‌ నిర్వాహకులకు మున్సిపల్‌ కమిషనర్‌ ఆశ్రిత్‌కుమార్‌ రూ.20వేల జరిమానా విధించారు. బుధవారం మోర్‌ సూపర్‌ మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు ఆహార పదార్థాలు గడువు దాటిపోయి ఉండటాన్ని గమనించి నిర్వాహకులను హెచ్చరించారు. అలాగే పట్టణంలోని మిలన్‌ గార్డెన్‌ వైపు చెత్త వేస్తున్న వారిని గుర్తించి శ్రీకాంత్‌కు రూ.1000, రాజుకు రూ.1000, ప్రసాద్‌కు రూ.500, ఆర్‌ఆర్‌ పాలడెయిరీ నిర్వాహకులకు రూ.500 జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం అయితే భారీ జరిమానా విధిస్తామని హెచ్చిరించారు.

దుబ్బాకటౌన్‌: మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తోందని జిల్లా మత్స్య శాఖ ఫీల్డ్‌ ఆఫీసర్‌ గౌతమి అన్నారు. బుధవారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో దౌల్తాబాద్‌ మండల కేంద్రంతో పాటు దొమ్మాట, గాజులపల్లి, సూరంపల్లి, ముత్యంపేట గ్రామాల సొసైటీ సంఘాల సభ్యులతో కలిసి చెరువులలో చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సొసైటీ సభ్యులు తలారి నర్సింహులు, సత్యం, రాజు, నాగులు, చంద్రం దశరథం, తదితరులు పాల్గొన్నారు.

7 నుంచి ‘మల్లన్న’  మూలవిరాట్‌ దర్శనం నిలిపివేత 
1
1/3

7 నుంచి ‘మల్లన్న’ మూలవిరాట్‌ దర్శనం నిలిపివేత

7 నుంచి ‘మల్లన్న’  మూలవిరాట్‌ దర్శనం నిలిపివేత 
2
2/3

7 నుంచి ‘మల్లన్న’ మూలవిరాట్‌ దర్శనం నిలిపివేత

7 నుంచి ‘మల్లన్న’  మూలవిరాట్‌ దర్శనం నిలిపివేత 
3
3/3

7 నుంచి ‘మల్లన్న’ మూలవిరాట్‌ దర్శనం నిలిపివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement