
మహిళల ఆర్థికాభివృద్ధికే శ్రీనిధి రుణాలు
దుబ్బాక: మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న సదుద్దేశ్యంతోనే ప్రభుత్వం బ్యాంకులు, శ్రీనిధి ద్వారా రుణాలు అందిస్తోందని డీఆర్డీఓ పీడీ జయదేవ్ ఆర్య అన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలోని ఐఓసీ భవనంలో నియోజకవర్గంలోని ఐకేపీ సీసీలు, వీఓఏలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించాలన్నారు. రుణాలను వ్యక్తిగత ఖాతాల్లోనే జమచేయడం జరుగుతుందన్నారు. రుణం పొందిన వెంటనే సభ్యులు భీమా చేసుకోవాలన్నారు. నియోజకవర్గంలో ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. సెర్ప్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు ప్రతి మహిళకు చేరేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏపీడీ సుధీర్, డీపీఎం వాసుదేవ్, విద్యాసాగర్, ప్రకాశ్, ఏపీఎంలు కృష్ణారెడ్డి, కిషన్, యాదగిరి, శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు ఉన్నారు.
డీఆర్డీఓ పీడీ జయదేవ్ ఆర్య