
మంత్రులకు ఘన స్వాగతం
హుస్నాబాద్‌లో మంత్రులకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీగా కిలోమీటర్ల మేర తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. రోడన్నీ పార్టీ కార్యకర్తల జోష్‌తో నిండిపోయింది. పబ్లిక్ మీటింగ్‌కు మహిళలు భారీగా తరలివచ్చారు. కాగా సమావేశంలో సాంస్కృతిక కళాకారులు సంక్షేమం, అభివృద్ధిపై ఆటపాటలతో ప్రజలను ఉత్తేజపరిచారు. కానీ సయ్యాటల పాటలు పాడటంతో మహిళలు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ, కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో అధ్యక్షుడు శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.