
ప్రజల రక్షణే ముఖ్యం
సీపీ అనురాధ
దుబ్బాకటౌన్: ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు విధులు నిర్వహించి, ప్రజల మన్ననలు పొందాలని సీపీ అనురాధ అన్నారు. బుధవారం బేగంపేట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. ఆమె మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌లో వివిధ కేసులలో ఉన్న వాహనాల అడ్రస్ తెలుసుకుని సంబంధిత యజమానులకు త్వరగా అప్పగించాలని ఎస్‌ఐకి సూచించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, తొగుట సీఐ లతీఫ్, బేగంపేట ఎస్‌ఐ మహిపాల్ రెడ్డి, సీసీఆర్బి సీఐ రామకృష్ణ, ఎస్బీ సీఐ శ్రీధర్ గౌడ్ తదితరులు న్నారు.
కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ తనిఖీ
కొండపాక(గజ్వేల్): మండల పరిధిలోని కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ను సీపీ అనురాధ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను, సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్, రికార్డ్స్, రైటర్‌రూమ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్య లు పరిష్కరించాలన్నారు. ఆన్‌లైన్ గేమ్స్, ఆన్ లైన్ బెట్టింగ్‌పై నిఘా పెంచాలని సూచించారు.
పథకాలు సద్వినియోగం చేసుకోండి
అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్
సిద్దిపేటజోన్: ‘ఏమ్మా.. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నావా? ప్రభుత్వం ఇల్లులేని వారికి ఇందిరమ్మ పథకం అమలు చేస్తోంది. సద్వినియోగం చేసుకోవాలి’ అని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. బుధవారం అదనపు కలెక్టర్ పట్టణంలో పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక 17 వార్డులో ఒక రేకుల ఇంటి వద్ద ఆగి ఇంటి యజమాని చిలుకల లక్ష్మితో ఆప్యాయంగా మాట్లాడారు. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు గూర్చి అరా తీశారు. దరఖాస్తు చేసినట్టు ఆమె చెప్పడంతో అక్కడే ఉన్న అధికారులను వెంటనే వెరిఫై చేయాలని సూచించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్ యార్డులో తనిఖీ చేశారు. అక్కడ కొత్తగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ నిర్మాణం పనులను పరిశీలించారు. కాళ్లకుంట కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ ప్రజలతో వైద్య సేవలు గురించి ఆరా తీశారు. అన్ని రకాల మందులు, ల్యాబ్ పరీక్షలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైద్య పోస్టులు
భర్తీ చేయండి
హుస్నాబాద్: ప్రభుత్వ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులు భర్తీ చేసేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరారు. ఈమేరకు బుధవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్‌రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి వైద్యం కోసం వందలాది మంది హుస్నాబాద్‌కు వస్తుంటారని తెలిపారు. పేద ప్రజలకు సరైన వైద్యం అందించేందుకు వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే మందుల కొరత లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధులు సుద్దాల చంద్రయ్య, అయిలేని మల్లికార్జున్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల రక్షణే ముఖ్యం

ప్రజల రక్షణే ముఖ్యం