
పలుచోట్ల మోస్తరు వాన
మొక్క మొక్కకు నీరు పోస్తూ..
హుస్నాబాద్‌లో 5.8మి.మీ.
వర్షపాతం నమోదు
జిల్లాలో బుధవారం పలుచోట్ల వర్షం కురిసింది. అత్యధికంగా హుస్నాబాద్ మండలంలో 5.8మీ.మీ, బెజ్జంకిలో 5మి.మీ, అక్కన్నపేటలో 3.6మి.మీ, సిద్దిపేట అర్బన్, కోహెడ మండలాల్లో 1.4మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
– ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)
పంటను కాపాడుకునేందుకు రైతు పాట్లు
వర్షం కురవకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. పంట ఎండిపోకుండా పడరాని పాట్లు పడుతున్నారు. హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లో రైతు దొంతరవేని రాజయ్య ఎకరంలో పత్తి పంట వేశారు. వానలు లేకపోవడంతో పత్తి మొక్కలను కాపాడుకోనేందుకు బిందెతో నీరు పోస్తున్నారు. వర్షాలు ఆలస్యమైతే మొక్క మొలిచేందుకు శక్తి ఉండదని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రూ.పది వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ఇది రాజయ్య బాధనే కాదు హుస్నాబాద్ డివిజన్‌లో 10 వేల ఎకరాల్లో పత్తి పంటలు వేసిన రైతుల గోస కూడా ఇలాగే ఉంది. – హుస్నాబాద్‌రూరల్

పలుచోట్ల మోస్తరు వాన

పలుచోట్ల మోస్తరు వాన